Begin typing your search above and press return to search.

గది లో సీక్రెట్ కెమెరా పెట్టిన హౌస్ ఓనర్!

By:  Tupaki Desk   |   12 July 2023 12:40 PM GMT
గది లో సీక్రెట్ కెమెరా పెట్టిన హౌస్ ఓనర్!
X
ఈ మధ్య కాలం లో రహస్య ప్రదేశాల్లో సీసీ కెమేరాలు పెట్టడం, మహిళలు దుస్తులు మార్చుకునే ట్రైల్ రూంస్ లో రహస్య కెమెరాలు పెట్టడం వంటి వార్తలు రెగ్యులర్ గా వెలుగు లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఇలాంటి పాడుప ని చేసిన ఒక ఇంటి యజమాని వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... యువతుల కు అద్దెకిచ్చిన ఒక గది లో రహస్యంగా సీసీ కెమేరాలు పెట్టిన ఒక ఇంటి యజమాని వ్యవహారం గుట్టు రట్టయ్యింది. యువతుల కు అద్దెకిచ్చిన గది లో రహస్యంగా కెమెరా ఏర్పాటు చేసి.. తన గది లోని కంప్యూటర్‌, సెల్‌ ఫోన్‌ తో దాని ని అనుసంధానం చేసుకున్న ఒక పాడుపని వెలుగు లోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్ లోని యూసుఫ్‌ గూడ సమీపం లోని వెంకటగిరి హైలం కాలనీ లో అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ యువతి (20) తన సోదరుడు, స్నేహితురా లితో కలిసి రెండు నెలల క్రితం ఒక గది లో అద్దెకు దిగారు. ఈ సమయంలో ఆ యువతులపై కన్నేసిన ఆ ఇంటి యజమాని (40) వారి గది లో ప్రత్యేకంగా విద్యుత్ మీటర్ బాక్స్ ను ఏర్పాటు చేశాడు.

అయితే అది విద్యుత్ మీటర్ బాక్స్ కాదు.. ఆ వంకన ఒక డబ్బా పెట్టి అందులో రహస్యంగా కెమెరాను ఫిక్స్ చేశాడు. దీనికి సంబంధించిన తీగను తన గది లోని కంప్యూటర్‌ కు కలిపాడు. ఇదే సమయంలో తన సెల్ ఫోన్ లో కూడా చూసుకోవడానికి యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాడు. ఇదే సమయం లో రెండు ప్రత్యేక డీవీఆర్‌ లు ఏర్పాటు చేసుకొని ఒక దానిని ప్రత్యేకంగా యువతుల గదికి అనుసంధానం చేశాడు.

ఇలా ప్రతిరోజూ వారు ఇంటికి రాగానే వారిని రహస్య కెమేరాల ద్వారా గమనిస్తూ ఉండేవాడట. అయితే తాజాగా రాత్రి గదిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో డబ్బా తెరిచిన యువతులు.. అందులో కెమెరా చూసి అవాక్కయ్యారట. ఇదే సమయంలో దాని వైరు యజమాని ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించారట.

దీంతో ఈ హటాత్పరిణామం నుంచి తేరుకున్న యువతులు... వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసుల కు ఫిర్యాదు చేశారట. దీంతో వెంటనే రంగం లోకి దిగిన పోలీసులు... ఆ ఇంటి యజమాని ని అదుపు లోకి తీసుకొని సెల్‌ ఫోన్‌, కెమెరా, డీవీఆర్‌ లను స్వాధీనం చేసుకున్నారట. ఆ డీవీఆర్ లో సుమారు 12 రోజుల డేటా ఉందని తెలుస్తుంది. అనంతరం అతడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు.