Begin typing your search above and press return to search.

ఆ అందాల భామను చంపేసిన గుర్రం

By:  Tupaki Desk   |   7 May 2023 9:58 AM GMT
ఆ అందాల భామను చంపేసిన గుర్రం
X
కొందరికి కొన్ని ఆసక్తులు ఉంటాయి. ఆ ఆసక్తే తమ జీవితం అన్నట్లుగా వారు వ్యవహరిస్తుంటారు. అలాంటి ఆసక్తులే వారి జీవితానికి ముగింపు పలికే పరిస్థితులు ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే ఆస్ట్రేలియా మోడల్ జీవితంలోనూ జరిగింది. ఆమె విషాదాంతం గురించి విన్న తర్వాత అయ్యో అనుకోకుండా ఉండలేరు. ఆస్ట్రేలియా కు చెందిన 23 ఏళ్ల సియెన్నా వీర్ మోడల్ గానే కాదు.. 2022 విశ్వసుందరి పోటీల్లో ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది.

ఆమెకు గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం. తన జీవితంలో గుర్రపు స్వారీ ఒక భాగమని.. అది లేకుండా అస్సలు ఊహించుకోలేనని చెబుతారు. ఆమె గుర్రాల్ని అమితంగా ఆరాధిస్తారు. అలాంటి ఆమె.. గత నెలలో విండ్సర్ పోలో గ్రౌండ్ లో గుర్రపు స్వారీ చేస్తున్న వేళ.. అనూహ్యంగా గుర్రం మీద నుంచి కింద కు పడిపోయారు. దీంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే.. గుర్రం మీద నుంచి కింద పడిన ఆమెకు తీవ్ర గాయాలు కావటంతో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ.. ఆమె శరీరం ఎలాంటి స్పందనలకు నోచుకోలేదు. దీంతో.. వైద్యులు సూచనతో ఆమె కుటుంబ సభ్యులు వెంటిలేటర్ ను తొలగించేందుకు అనుమతి ఇచ్చారు. ఆమె మరణ వార్త ఆమె అభిమానుల్ని అమితంగా వేదనకు గురి చేసింది.

ఆమెకు ఎంతో ఇష్టమైన గుర్రపు స్వారీ నే ఆమె ప్రాణాలు పోయేందుకు కారణం కావటాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. ఈ మధ్యనే తన కెరీర్ ను మరింత పెంచుకునేందుకు వీలుగా బ్రిటన్ కు షిప్టు కావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతలోనే.. ఈ ప్రమాదం చోటుచేసుకోవటం.. ప్రాణాలు కోల్పోవటం పలువురిని వేదనకు గురి చేస్తోంది.