Begin typing your search above and press return to search.

ఏపీలో వైసీపీదే అధికారం.. మరో సంచలన సర్వే

By:  Tupaki Desk   |   22 May 2019 6:09 AM GMT
ఏపీలో వైసీపీదే అధికారం.. మరో సంచలన సర్వే
X
ఆదివారం పోలింగ్ ముగియగానే జాతీయ చానెళ్లు, వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కేంద్రంలో అందరూ బీజేపీకే పట్టం కట్టగా.. ఏపీలో మాత్రం మిశ్రమ ఫలితాలను వ్యక్తం చేశాయి. మెజార్టీ వైసీపీ గెలుస్తుందనగా..లగడపాటి , చాణక్య మరో రెండు సంస్థలు టీడీపీ వైపు మొగ్గుచూపాయి.

అయితే ప్రఖ్యాత జాతీయ మీడియా సంస్థ ది హిందూ దినపత్రిక - సీఎస్డీఎస్-లోక్ నీతి సంస్థలతో కలిసి చేసిన ఎగ్జిట్ పోల్స్ ను తాజాగా ప్రకటించింది. ది హిందూ దేశంలో పురాతన పత్రిక. ఎంతో క్రెడిబిలిటీ ఉన్న మీడియా సంస్థ. దీంతో దీని ఎగ్జిట్ పోల్స్ కు విశ్వసనీయత పెరుగుతోంది.

ది హిందూ- సీఎస్డీఎస్-లోక్ నీతి సర్వే ప్రకారం కేంద్రలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో ఎన్డీఏకు 40-42శాతం వరకు ఓట్ షేరింగ్ జరిగిందని ఈసర్వే తేల్చింది. ఇక యూపీఏకు 28-30శాతం వరకే ఓట్ షేరింగ్ జరిగిందని అంచనావేసింది. ఇతరులకు 18-20శాతం వరకూ ఓట్ షేరింగ్ ఉందని అంచనావేసింది.

ఇక ఏపీకి సంబంధించి కూడా దిహిందూ ఫలితాలను వెల్లడించింది. అత్యధికంగా ఏపీలో వైసీపీకి 43శాతం ఓట్ షేరింగ్ జరిగిందని.. టీడీపీకి 38శాతం ఓట్ షేరింగ్ ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది. ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య దాదాపు 5శాతం ఓట్ల తేడా ఉండడంతో వైసీపీకి మెజార్టీ స్థానాలు దక్కుతాయని తెలుస్తోంది. ఎందుకంటే 2014లో ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 1.95శాతమే.. కానీ టీడీపీకి 102 సీట్లు - వైసీపీకి 67సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఐదు శాతం ఎడ్జ్ ఉన్న వైసీపీ ఏపీలో అత్యధిక ఎమ్మెల్యే - ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమంటున్నారు.

ది హిందూ- సీఎస్డీఎస్-లోక్ నీతి సర్వే ప్రకారం ఏపీలో 43శాతం ఓటింగ్ తో వైసీపీకి దాదాపుగా 18-22 లోక్ సభ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. టీడీపీకి 3-6 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది.

అయితే జాతీయ చానెళ్లు - సర్వేల్లో మెజార్టీ వైసీపీ గెలుస్తుందనడం.. ఇప్పుడు హిందూ కూడా వైసీపీకే మొగ్గుచూపడంతో ఆ పార్టీలో జోష్ వ్యక్తమవుతోంది. కానీ టీడీపీ అధినేత మాత్రం ఎగ్జిట్ పోల్స్ నమ్మడం లేదు. టీడీపీదే 100శాతం విజయం అంటున్నారు. చూడాలి మరి బాబు నమ్మకం నిజమవుతుందా..? జాతీయ చానెళ్ల ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా అన్నది.. రేపు తేలుతుంది.