Begin typing your search above and press return to search.

ఆ కేసుల విచారణకు లైవ్ టెలికాస్ట్ కు నో చెప్పిన హైకోర్టు

By:  Tupaki Desk   |   5 Nov 2020 6:30 AM GMT
ఆ కేసుల విచారణకు లైవ్ టెలికాస్ట్ కు నో చెప్పిన హైకోర్టు
X
రీల్ కు రియల్ కు మధ్య తేడా చాలానే ఉంటుంది. కొన్ని సాధ్యం కానివి.. సాధ్యమయ్యేలా చూపించే సినిమాల్ని చూసి స్ఫూర్తి పొందారేమో కానీ.. ఏపీ రాజధాని అమరావతి అంశంపై విజయవాడకు చెందిన వేమూరు లీలా క్రిష్ణ ఇటీవల హైకోర్టులో ఒక పిల్ వేశారు. తాజాగా జరుగుతున్న అమరావతి రాజధాని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు తెలిసేలా నిర్వహించాలని కోరారు.

ఆయన పిల్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇలాంటి అభ్యర్థనల్ని ఇప్పటికే తాము రిజెక్టు చేసినట్లుగా వెల్లడించారు. అంతేకాదు.. ఇలాంటి అభ్యర్థనల్ని ఇప్పటికే పలు కోర్టులు తిరస్కరించినట్లుగా హైకోర్టు రిజిస్ట్రార్ తరఫు న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వెల్లడించారు.

దీనికి స్పందించిన హైకోర్టు. ఆ కేసులకు సంబంధించిన అంశాల్ని కోర్టు ముందుకు తీసుకురావాలని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిపై నమోదైన కేసుల విచారణ ఎప్పటిలానే జరుగుతుంది తప్పించి.. సినిమాల్లోచూపించినట్లుగా ప్రత్యక్ష ప్రసారంలో జరిగే అవకాశం లేదని చెప్పక తప్పదు.