Begin typing your search above and press return to search.

తిరుపతి ఉప ఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   30 April 2021 10:33 AM GMT
తిరుపతి ఉప ఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం
X
ఇటీవల ముగిసిన తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ.. ఏపీ హైకోర్టును టీడీపీ.. బీజేపీ అభ్యర్థులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ వేళ.. అధికారపార్టీకి చెందిన నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. దొంగ ఓట్లు వేశారంటూ కొన్ని ఆధారాలతో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిగింది.

తాజాగా ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యల చేసింది. హైకోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టేసిన ఏపీ హైకోర్టు.. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచన చేసింది. పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరిగినట్లుగా ఆధారాలు చూపించిన నేపథ్యంలో.. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాలన్న సలహాను ఇచ్చింది.

ఈ పిటిషన్ కు జత చేసిన ఆధారాల్ని ఎన్నికల కమిషన్ కు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది కాబట్టి.. దీనిపై తాము నిర్ణయాన్ని తీసుకోలేమని హైకోర్టు పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ ఎన్నికల ఫలితాల వెల్లడి మరో రెండు రోజుల్లో (మే 2న) వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికను కొట్టివేయాలన్న పిటిషన్ పై హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించిది. ఈ నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేసిన పనబాక లక్ష్మి.. రత్నప్రభలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించటం తప్పించి మరో మార్గం లేదని చెప్పాలి. మరేం చేస్తారో చూడాలి.