Begin typing your search above and press return to search.

ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!!

By:  Tupaki Desk   |   22 July 2020 11:30 AM IST
ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!!
X
ఏపీ హైకోర్టు మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేసింది. ఈ సారి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రూల్ ఆఫ్ లా ఉందా అంటూ మండిపడింది.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లాయర్ సుభాష్ చంద్రబోస్ వ్యవహారంలో దాఖలైన పిటీషన్ పై విచారించిన కోర్టు ఆయన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఈ కేసులో విచారణకు హాజరైన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పోలీసులు అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు లాయర్ సుభాష్ ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. ఇదంతా చూస్తుంటే రూల్ ఆఫ్ లా అమల్లో ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించింది.

ఏపీలో లాయర్ల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని కోర్టు ప్రశ్నించింది. పోలీసులు ప్రజా హక్కుల రక్షకులని.. రాజకీయ నేతలకు పనిచేసేవారు కాదని గుర్తు చేసింది.

ఇక పోలీసులకు వ్యతిరేకంగా కోర్టు ఏమైనా ఉత్తర్వులు ఇష్తే కష్టాల్లో పడతారని.. అప్పుడు ఏ రాజకీయ నేత ఆదుకోవడానికి ముందుకు రారని పోలీసులను తీరుపై వ్యాఖ్యానించింది. బ్యూరోక్రాట్స్, పోలీసులు రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తే చేరవచ్చని తెలిపింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది.