Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్

By:  Tupaki Desk   |   27 Oct 2021 9:52 AM GMT
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్
X
అయినా వారిని.. కానివారిని.. ఇలా ఎలిగేషన్స్ ఉన్న వారందరికీ టీటీడీ బోర్డులో పెట్టిన ఏపీ ప్రభుత్వంపై కొందరు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఆగస్టు నెలలో టీటీడీ పాలకమండలిని నియమించిన తీరు వివాదాస్పదమైంది. టీటీడీ చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం ఇవ్వడంతోపాటు పలువురిని బోర్డు సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా టీటీడీ బోర్డు నియామకాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలకమండలి సభ్యులుగా నేరచరిత్ర ఉన్న వారిని నియమించారంటూ జీవోను సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

భానుప్రకాష్ పిటీషన్ పై న్యాయవాది అశ్వినికుమార్.. ధర్మాసనానికి వాదనలు వినిపించారు. భారత వైద్యమండలి మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్ ను పాలకమండలి సభ్యులుగా నియమించడంపై అశ్వినీకుమార్ అభ్యంతరం తెలిపారు.ప్రభుత్వం కేతన్ దేశాయిని నియమించడంపై హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో నేరచరిత్ర ఉన్న వారిని నియమించారంటూ గత కొన్ని రోజులు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైకోర్టు వ్యాఖ్యలతో ఇది మరోసారి వివాదాస్పదమైంది.