Begin typing your search above and press return to search.
ముఖ్యమంత్రికి షాకిచ్చేలా బయటకొచ్చేసిన హీరోయిన్లు
By: Tupaki Desk | 20 May 2021 8:30 AM GMTతప్పు జరిగినప్పుడు ప్రశ్నించటం.. అన్యాయాన్ని నిలదీయటం లాంటివి రీల్ లో చాలానే చూస్తాం. అయితే.. ఇలాంటివన్నీ హీరో చేస్తుంటాడు. అతడి పక్కనే హీరోయిన ఉంటుంది కానీ.. బొమ్మలా చూస్తూ ఉంటుంది.కొన్ని సినిమాల్లో మాత్రం నోరు విప్పుతుంది. అదంతా రీల్ లైఫ్. మరి.. రియల్ లైఫ్ లో? రీల్ హీరోలకు మించి.. ఆ మాటకు వస్తే అందాల బొమ్మలుగా తెర మీద కనిపించే హీరోయిన్లు.. రియల్ లైఫ్ లో అసలుసిసలు హీరోలుగా రియాక్టు అవుతున్న వైనం సంచలనంగా మారింది.
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. సామాజిక అంశాలు.. రాజకీయ పరిణామాల మీద నోరు విప్పటానికి హీరోలకే ధైర్యం చాలదు అలాంటిది హీరోయిన్లు గళం ఏం విప్పుతారు? అయితే.. ఇందుకు భిన్నంగా తాజాగా మలయాళ హీరోయిన్లు ఇప్పుడు వినూత్నంగా గళం విప్పారు. కేరళలో పినరయి ప్రభుత్వం రెండోసారి కొలువు తీరిన నేపథ్యంలో.. ఆరోగ్య మంత్రిగా అద్భుత పనితీరును ప్రదర్శించిన శైలజ టీచర్ కు మంత్రివర్గంలో చోటు కల్పించని వైనంపై గళం విప్పారు.
ప్రాణాంతక నిపా వైరస్ తో పాటు.. కరోనా మొదటి వేవ్ ను అడ్డుకట్ట వేయటంలో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న శైలజ టీచర్ కు కేబినెట్ లో చోటుకల్పించకపోవటం ఏమిటన్న సూటి ప్రశ్నను సంధించటమే కాదు.. బ్రింగ్ బ్యాక్ శైలజ టీచర్.. బ్రింగ్ అవర్ టీచర్ బ్యాక్ లాంటి హ్యాష్ టాగ్ లతో హీరోయిన్లు పార్వతి.. అనుపమా పరమేశ్వరన్.. మాళవిక మోహన్ తదితరులు సీఎం పినరయి విజయన్ కు ట్వీట్లతో ప్రశ్నిస్తున్నారు.
మంత్రివర్గంలో ఆమె కచ్ఛితంగా ఉండాల్సిన వ్యక్తి అని.. శైలజకు అన్యాయం జరిగిందని.. రాష్ట్ర ప్రజలకు ఉత్తమమైన నేత అవసరంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఇలాంటి రాజకీయ అంశాల విషయంలో సామాన్యులు.. రాజకీయ నేతలు స్పందించటం మామూలే. ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా దూరంగా ఉండే హీరోయిన్లు రోటీన్ కు భిన్నంగా గళం విప్పటం.. ముఖ్యమంత్రినే సూటిగా ప్రశ్నించటం ఇప్పుడు సంచలనంగా మారింది. శైలజ టీచర్ కు జరిగిన అన్యాయంపై మలయాళ సూపర్ స్టార్లు.. అగ్ర నటులు మౌనంగా ఉంటే.. అందుకు భిన్నంగా హీరోయిన్లు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తూ.. రియల్ హీరోయిజం ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. ఏమైనా.. కొత్త తరహాగా రియాక్టు అవుతున్న హీరోయిన్ల తీరును అభినందించాల్సిందే.