Begin typing your search above and press return to search.

స‌రిహ‌ద్దులో తుపాకుల మోత‌..ఇండియ‌న్ ఆర్మీ వీరోచిత పోరాటం..భార‌త సేన‌ల ఘ‌న విజ‌యం!

By:  Tupaki Desk   |   15 March 2021 10:10 AM GMT
స‌రిహ‌ద్దులో తుపాకుల మోత‌..ఇండియ‌న్ ఆర్మీ వీరోచిత పోరాటం..భార‌త సేన‌ల ఘ‌న విజ‌యం!
X
స‌రిహ‌ద్దులో ఇటు చైనాతో పోరు సాగిస్తున్న భార‌త్.. అటు పాకిస్థాన్ తోనూ త‌ల‌ప‌డుతోంది. త‌ర‌చూ పాక్ సైనికులు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాల‌ను ఉల్లంఘిస్తుండ‌గా.. భార‌త్ లోకి చొర‌బ‌డేందుకు ఉగ్ర‌వాదులు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఉగ్ర‌వాదులు క‌శ్మీర్ లో మాటువేశార‌న్న‌ స‌మాచారం అందుకున్న భార‌త ఆర్మీ.. వారిని చుట్టు ముట్టింది.

అయితే.. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఉగ్ర‌వాదులు కాల్పులు మొద‌లు పెట్టారు. ప్ర‌తిగా ఆయుధాల‌కు ప‌నిచెప్పిన భార‌త ఆర్మీ.. స్థానిక పోలీసుల‌తో క‌లిసి ముష్క‌రులను‌ ఎదుర్కొంది. ఇలా మొద‌లైన తుపాకుల మోత గంట‌లు దాటి రోజుల‌కు చేరింది. దాదాపు మూడు రోజుల‌పాటు కొన‌సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో భార‌త ద‌ళాలు విజ‌యం సాధించాయి.

క‌రుడు గ‌ట్టిన ఉగ్ర‌వాదిగా ఉన్న స‌జ్జాద్ అప్ఘ‌నితోపాటు మ‌రో ఉగ్ర‌వాదిని మ‌ట్టుబెట్టాయి. కీల‌క టెర్ర‌రిస్టుగా ఉన్న స‌జ్జాద్ హ‌త‌మ‌వ‌డం భార‌త సేన‌లు సాధించిన ఘ‌న విజ‌యంగా చెప్పుకోవ‌చ్చు. ఎన్నో నేరాల్లో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నాడు స‌జ్జాద్‌. కాగా.. ఇటీవ‌ల అల్ బ‌ద‌ర్ చీఫ్ గ్యానీ ఖ్వాజాను కూడా భార‌త సైన్యం మ‌ట్టుబెట్టిన విష‌యం తెలిసిందే. ఈ విధంగా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు కీల‌క ఉగ్ర‌వాదుల‌ను అంతంమొందించ‌డం గ‌మ‌నార్హం.