Begin typing your search above and press return to search.
వన్డే సారథిగా కోహ్లిని తప్పిస్తారా..? ట్రెండింగ్ లో #ShameonBCCI
By: Tupaki Desk | 10 Dec 2021 10:30 AM GMT95 వన్డేల్లో సారథ్యం వహించి.. 65 మ్యాచ్ ల్లో గెలిపించి.. విజయాల శాతం 70 పైగా ఉన్న విరాట్ కోహ్లిని కెప్టెన్ గా తప్పించడంపై అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బీసీసీఐ మీద మండిపడుతున్నారు. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఓవరాల్ గా టీమిండియా మిగతా వాళ్ల సారథ్యంలో కంటే కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్ లు గెలిచిందని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జనరల్ సెక్రటరీ జై షా ఇద్దరూ కలిసి కుట్ర పన్నారంటూ కోహ్లీ అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో #ShameonBCCI అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు.
ఐసీసీ ట్రోఫీలు గెలవనంత మాత్రాన..
ఐసీసీ ట్రోఫీలు గెలవనంత మాత్రాన ఆ తప్పునంతా విరాట్ మీద నెట్టేస్తారా? అని అభిమానులు బీసీసీఐని నిలదీస్తున్నారు. ఇలాగైతే బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు హయాంలోనూ ఐసీసీ టోర్నీలు గెలవలేకపోయిన ఉదాహరణలను గుర్తు చేస్తున్నారు. అంతెందుకు..? మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోనూ కొన్ని ఐసీసీ టోర్నీలు చేజారిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఐసీసీ టోర్నీలు గెలవలేదన్ననెపంతో ఒక మంచి ఆటగాడిని అవమానించడం సబబు కాదని కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు.
గౌరవంగా కూడా తప్పించరా?
కనీసం ప్రెస్‌మీట్ పెట్టకుండా చివరి సిరీస్ అని ప్రకటించకుండా కోహ్లీని కెప్టెన్‌గా తొలగించడం సరికాదని అభిమానులు పేర్కొంటున్నారు. ఆట పట్ల అత్యంత అంకితభావం కనబర్చే కోహ్లి విషయంలో బీసీసీఐ హుందాగా వ్యవహరించాల్సి ఉండాల్సిందని అభిప్రాయ పడుతున్నారు. అయితే కొందరు క్రికెట్ అభిమానులు మాత్రం కోహ్లీ... నాడు దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే విషయంలో వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తున్నారు. తన పంతం నెగ్గించుకునేందుకు కోహ్లి నాడు ఎంత పట్టుదలతో వ్యవహరించినదీ గుర్తుచేస్తున్నారు.
నాడు బీసీసీఐ కోహ్లి చెప్పినట్లు విన్నదని.. కుంబ్లే తప్పుకోగానే రవిశాస్త్రిని కోచ్ గా నియమించిందని ప్రస్తావిస్తున్నారు. అలా చూస్తే కోహ్లికి తగిన శాస్తి జరిగిందని, ఫలితం అనుభవిస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదైమైనా కోహ్లీ కోసం పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు.