Begin typing your search above and press return to search.

అమ్మాయి అని హిజ్రాతో పెళ్లి.. చివరకేమైందంటే?

By:  Tupaki Desk   |   24 Jun 2021 12:30 AM GMT
అమ్మాయి అని హిజ్రాతో పెళ్లి.. చివరకేమైందంటే?
X
చూడడానికి దేవకన్యలా ఉంది ఆ అమ్మాయి. హీరోయిన్ ను తలపించేలా ఉన్న ఆమెను చూసి యువకుడు తొలి చూపులోనే ఒకే చెప్పాడు. అంగరంగ వైభవంగా పెళ్లి కూడా జరిగింది. తనకు అందమైన భార్య వచ్చిందని ఆ వరుడికి పట్టపగ్గాల్లేవు. ఫ్రెండ్స్ కు ఘనంగా పార్టీ కూడా ఇచ్చాడట.. తొలి శోభన రేయికి రెడీ అయ్యాడు.

పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత తను పెళ్లి చేసుకుంది అమ్మాయి కాదని.. హిజ్రా అని తెలిసి ఆ యువకుడు షాక్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ విచిత్రం చోటు చేసుకుంది.

కాన్పూర్ కుచెందిన యువకుడు శాస్త్రినగర్ కు చెందిన యువతిని ఏప్రిల్ 28న పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం వధూవరులకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ రాత్రి వరుడు ఎంత ప్రయత్నించినా శృంగారం జరగలేదు. ఆ తర్వాత వరుడు వరుసగా మరుసటి రోజుల్లో ప్రయత్నించినా సెక్స్ మాత్రం జరగడం లేదు.

అసలు ఎందుకు ఆ కార్యం జరగడం లేదని డౌట్ వచ్చి ఓ రోజు భార్యను గైనకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పరిశీలించిన వైద్యులు.. ఆమె అసలు అమ్మాయి కాదని.. లింగమార్పిడి జరిగిందని.. కాబట్టి అమ్మాయిలా జననాంగాలు పూర్తిగా లేకపోవడంతో సెక్స్ వారి మధ్య జరగడం లేదని తేల్చారు.

అందమైన భార్య అనుకొని పెళ్లి చేసుకున్న వరుడు.. చివరకు ఇప్పుడు ఆమె హిజ్రా అని తెలిసి.. శృంగారానికి ఆమె అవయవాలు సహకరించవని తెలుసుకొని భోరుమన్నాడు. హిజ్రా అని తెలిసి తనను మోసం చేసిన అత్తమామలపై పోలీస్ కేసు పెట్టాడు. సంబంధం చూసిన మధ్యవర్తిని అందులో ఇరికించాడు.

అత్తా మామ, వధువు, మధ్యవర్తి సహా 8మందిపై కేసు నమోదు చేశామని పోలీస్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.