Begin typing your search above and press return to search.

ప్లాన్ చేసి చంపి..మిస్ ఫైర్ అన్నాడు..అడ్డంగా దొరికిన హోంగార్డు !

By:  Tupaki Desk   |   12 April 2021 12:30 PM GMT
ప్లాన్ చేసి చంపి..మిస్ ఫైర్ అన్నాడు..అడ్డంగా దొరికిన హోంగార్డు !
X
పక్కా ప్లాన్ చేసి భార్యను చంపేశాడు ఓ హోంగార్డు. తర్వాత ఆ హత్యని మిస్ ఫైర్ ఘటనగా చిత్రీకరించాలని తీవ్రంగా ప్రయత్నించి, పోలీసుల వ్యూహాత్మకమైన ఎత్తుగడల ముందు చివరికి అడ్డంగా బుక్కైయ్యాడు. బెజవాడ మిస్ ఫైర్‌ ఘటనలో అసలు నిజాలు బయటకు వచ్చాయి. భార్య రత్నప్రభను హోంగార్డ్ వినోద్‌ ఉద్దేశపూర్వకంగానే కాల్చి చంపాడని పోలీసులు నిర్దారించారట. విజ‌య‌వాడ‌లోని గొల్ల‌పూడిలో భార్య‌పై కాల్పులు జ‌రిపి, గ‌న్ మిస్‌ఫైర్ కావ‌డంతో అవాంఛ‌నీయ ఘ‌ట‌న జ‌రిగింద‌ని సీన్ క్రియేట్ చేయ‌డానికి య‌త్నించి, చివ‌రికి అడ్డంగా దొరికిపోయాడు. చివ‌రికి హోంగార్డే భార్య‌పై కాల్పులు జ‌రిపిన‌ట్టు విచార‌ణాధికారులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు రావ‌డం మిస్‌ ఫైర్ కేసులో ప్రధాన ట్విస్ట్ అని చెప్పొచ్చు. దీంతో హోంగార్డు వినోద్ ‌కుమార్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే ... తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వినోద్, రత్నప్రభ కొన్ని నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో భార్యాభర్తలిద్దరూ గత కొన్ని రోజులుగా గొడవపడుతూ వచ్చారు. ఈ ఘర్షణ సమయంలో వినోద్ తన దగ్గర ఉన్న తుపాకితో కాల్చి చంపాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదట తుపాకి మిస్‌ ఫైర్‌ అయి తన భార్య చనిపోయిందని డ్రామాలాడాడు వినోద్‌. అర్దరాత్రి ఈ ఘటన జరగడం తో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించి నిజాలు చెప్పించారు. బంగారు నగలు తాకట్టు విషయంలో గొడవ జరిగి హోమ్ గార్డ్ వినోద్, భార్య పై ఫైర్ చేయడం వల్ల ఆమె చనిపోయిందని విజయవాడ సీఎపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. రెండు నెలలుగా వీరి మధ్య గొడవ జరుగుతుందని, తాకట్టు పెట్టిన ఆ నగలు విడిపించమని ఒత్తిడి చేసిందన్నారాయన. హోంగార్డ్ మీద ప్రస్తుతం మర్డర్ కేసు కట్టామని, విచారణ జరుగుతుందని చెప్పారు సీపీ . ప్ర‌స్తుతం కేసు విచార‌ణ‌లో ఉంద‌ని, పూర్తి వివ‌రాలు రాబ‌ట్టాల్సి ఉంద‌ని తెలిపారు. మొత్తానికి భార్య‌పై బుల్లెట్ దించి, దాన్ని మిస్‌ ఫైర్ ‌గా చూపే ప్రయత్నం విఫలం అయ్యింది అని చెప్పొచ్చు. సీఎం సెక్యూరిటీ వింగ్ లో ఏ.ఎస్పీ శశికాంత్ దగ్గర వినోద్ అనే హోంగార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.