Begin typing your search above and press return to search.

గూగుల్ మ్యాప్ ఆన్ చేసి మండపానికి బయల్దేరిన వరుడు.. తీరా చూస్తే..!

By:  Tupaki Desk   |   11 April 2021 5:30 AM GMT
గూగుల్ మ్యాప్ ఆన్ చేసి మండపానికి బయల్దేరిన వరుడు.. తీరా చూస్తే..!
X
ఒకప్పుడు అడ్రస్ తెలియకపోతే వేరేవాళ్లను అడిగివెళ్లేవారు. ఇతరుల సాయంతో తమ గమ్యానికి చేరుకునేవారు. కానీ పెరిగిన సాంకేతికత కారణంగా అలా అడగడం మానేశారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వారు గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తున్నారు. అలా అడవిలోకి అయినా వెళ్తున్నారు. కానీ ఈ మ్యాపుల వల్ల జరిగిన లాభాలతో పాటు అనర్థాలు కూడా ఎక్కువే ఉన్నాయి.

ఓ వరుడు తన పెళ్లి కోసం వధువు ఇంటికి బయల్దేరాడు. గూగుల్ మ్యాప్ ఆన్ చేసి వధువు ఉండే ఊరికి కుటుంబంతో సహా పయనమయ్యారు. పెళ్లి వస్త్రాలతో వస్తున్న ఆయనను చూసి అక్కడివారంతా షాకయ్యారు. నిజానికి పెళ్లి కూతురు కూడా విస్తుపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్ పుణ్యమా? అని ఆ వరుడు ఇంకో మండపానికి వెళ్లాడు. సరిగ్గా అదేసమయంలో మరో నిశ్చితార్థ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికంగా ఒకింత ఆశ్చర్య, హాస్యం నెలకొంది.

ఒక గ్రామంలో రెండు శుభకార్యాలు జరుగుతున్నాయి. గూగుల్ మ్యాప్ ఆన్ చేసి వరుడు, ఆయన కుటుంబం జెంగ్ కోల్ హామ్లెట్ కి వెళ్లారు. అప్పటికే ఉల్ఫా, ఆమె కుటుంబం నిశ్ఛితార్థానికి వచ్చే వరుడి కోసం ఎదురుచూస్తున్నారు. నిశ్చతార్థానికి పెళ్లి వస్త్రాల్లో వచ్చిన వరుడిని చూసి అంతా షాకయ్యారు. కాసేపు అక్కడ అయోమయం నెలకొంది. తనకు కాబోయే భర్త కెండాల్ నుంచి రావాల్సి ఉండగా పెమలాంగ్ నుంచి వచ్చారని వధువు తెలుసుకుంది. దీనిపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

గూగుల్ మ్యాప్ ఆన్ చేసి వచ్చామని వరుడు వారికి చెప్పారు. దాంతో తను వచ్చింది వేరే ప్రాంతానికి అని అర్థమైంది. ఈ విషయం తెలుసుకొని దారి తప్పిన వరుడు కుటుంబాన్ని ఉల్ఫా కుటుంబ సభ్యులు వారి గమ్యస్థానానికి చేర్చారు. దాంతో ఈ ఆసక్తికర సంఘటనకు తెర పడింది. అయితే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. పెళ్లిదాకా వచ్చిన వరుడి వధువు, ఆమె చిరునామా తెలియకుండా ఎలా ఉంటుందని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.