Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ డే స్పీచులోనే కేసీఆరే టార్గెట్.. గవర్నర్ తగ్గలేదు

By:  Tupaki Desk   |   26 Jan 2023 1:02 PM GMT
రిపబ్లిక్ డే స్పీచులోనే కేసీఆరే టార్గెట్.. గవర్నర్ తగ్గలేదు
X
తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు సంకుల సమరం నడుస్తోంది. ఈ ఇద్దరి ఆధిపత్యపు పోరాటాలు ప్రతీ సందర్భంలోనూ కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. తాజాగా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకూడదని కేసీఆర్ ప్రభుత్వం డిసైడ్ కావడం.. హైకోర్టు నిర్వహించాల్సిందేనని తీర్పునివ్వడంతో ఇరుకునపడింది. ఆ తర్వాత రాజ్ భవన్ వేదికగానే నిర్వహించింది. దీన్ని ఆధారం చేసుకొని జెండావిష్కరించిన గవర్నర్ తమిళిసై ఈరోజు కేసీఆర్ సర్కార్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు గురువారం గవర్నర్ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ఇది చాలా స్పష్టంగా కనిపించిందని అర్థమవుతోంది.

రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర వేడుకలకు కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా ఏర్పాట్లు చేయడంతోపాటు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్‌తో పాటు పోలీసు బ్యాండ్‌తో వేడుకకు హాజరయ్యారు. అయినా తమిళిసై తన ప్రసంగంలో రాజకీయం ధ్వనించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

ప్రభుత్వం అందించిన ప్రతి గవర్నర్ ప్రసంగంలో లేదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశంసిస్తూనే, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తూ గవర్నర్ తన స్వంత స్క్రిప్ట్‌ను చదివారని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.

కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన తమిళిసై, అభివృద్ధి అంటే సచివాలయానికి కొత్త భవనాల నిర్మాణం కాదని, జాతి నిర్మాణం ద్వారానే నిజమైన అభివృద్ధి జరగాలని అన్నారు. "ఇప్పుడు మనకు కావలసింది కొంతమందికి ఫామ్‌హౌస్‌లు నిర్మించడం కాదు, ప్రజలకు వ్యవసాయ భూములు. రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనిని అరికట్టాలి"అని ఆమె అన్నారు. రాష్ట్రానికి భారీ ప్రయోజనాన్ని అందించినందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం విస్మరించిందని ఆమె మండిపడ్డారు.

"మన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం గురించి కాదు.. మన స్వంత విశ్వవిద్యాలయాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో సరైన మౌలిక సదుపాయాలను సృష్టించాలి" అని ఆమె అన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించే బదులు దానిని రక్షించి గౌరవించాలని తమిళిసై అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. నేను ఇలా చెప్పినప్పుడు, కొంతమందికి నేను నచ్చకపోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలందరినీ నేను ఇష్టపడతాను” అని గవర్నర్ పరోక్షంగా కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రిపబ్లిక్ డేనాడు ప్రసంగంలో రాజకీయ విమర్శలు చేయడం దుమారం రేపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.