Begin typing your search above and press return to search.

ఇంత కాలానికి ఓ మంచి సలహా ఇచ్చాడే

By:  Tupaki Desk   |   19 April 2021 9:30 AM GMT
ఇంత కాలానికి ఓ మంచి సలహా ఇచ్చాడే
X
అవును తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే టార్గెట్ గా ఉంటుందని అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నేతన్నాక ప్రభుత్వంలో జరిగే తప్పులను ప్రశ్నించాల్సిందే, బయటపెట్టాల్సిందే. కానీ చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో మాత్రం వ్యక్తిగతంగా జగన్ అంటే ధ్వేషంతో రెచ్చిపోతున్నారు. కాబట్టే వాళ్ళ ప్రెస్ మీట్లన్నా, ట్వీట్లన్నా జనాల్లో విలువలేకుండా పోతోంది.

ఇలాంటి నేపధ్యంలో బహుశా మొదటిసారేమో లోకేష్ నుండి ప్రభుత్వానికి ఓ నిర్మాణాత్మకమైన సూచన, సలహా వచ్చింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతి పెరిగిపోతున్న కారణంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని సూచించారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ఓ లేఖరాశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయటమో లేకపోవే వాయిదా వేయటమో చేసి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఒకవైపు విజృంభిస్తున్న కరోనా మరోవైపు పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్ధులతో పాటు తల్లి, దండ్రుల్లో టెన్షన్ పెరిగిపోతోందని వివరించారు. పనిలోపనిగా పరీక్షలను రద్దు చేయటమే ఉత్తమమని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇప్పటికే కొన్ని స్కూళ్ళల్లోని విద్యార్ధులకు కరోనా సోకిన విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు. కేంద్రప్రభుత్వం, తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే సీబీఎస్ఇ పరీక్షలను రద్దు చేసిందని గుర్తుచేశారు.

10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాల్సిన విద్యార్ధుల సంఖ్య 15 లక్షలున్నట్లు లోకేష్ చెప్పారు. ఇన్ని లక్షల మంది ప్రాణాలను రిస్కులో పెట్టడం మంచిదికాదని సలహా ఇచ్చారు. కాబట్టి వెంటనే ఏదో నిర్ణయం తీసుకుని విద్యార్ధులు, తల్లి, దండ్రుల్లో టెన్షన్ తగ్గించాలని సూచించారు. మొత్తానికి లోకేష్ రాసిన లేఖ విద్యార్ధులు, తల్లి, దండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా ఉండటం గమనార్హం.