Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్..ఈ ఏడాది జీతాలు పెరగటం ఖాయమట

By:  Tupaki Desk   |   16 Feb 2021 12:30 AM GMT
గుడ్ న్యూస్..ఈ ఏడాది జీతాలు పెరగటం ఖాయమట
X
కరోనా దెబ్బకు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. కొందరు మినహాయిస్తే.. ప్రభుత్వాలు.. కంపెనీలు.. ఉద్యోగులు.. వ్యాపారస్తులు ఇలా ఒకరేమిటి అందరూ ఇబ్బంది పడినోళ్లే. మాంచి స్పీడ్ మీద జోరుగా వెళుతున్న కారు సడన్ బ్రేక్ వేస్తే ఎలాంటి కుదుపునకు గురి అవుతాయో.. సరిగ్గా అలాంటి పరిస్థితినే అనుభవంలోకి తీసుకొచ్చింది కరోనా.

ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి బయటకొస్తున్న వారికి స్వీట్ న్యూస్ చెప్పిందో సర్వే సంస్థ. ఈ ఏడాది మన దేశంలోని ఉద్యోగులకు వేతన పెంపు ఖాయమని తేల్చింది. అయితే.. గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది కానీ మరీ అంత సూపర్ గా అయితే మాత్రం ఉండదంటున్నారు. గత ఏడాదిలో 5.9 శాతం సగటుతో పోలిస్తే.. ఈసారి కాస్త మెరుగై 6.4శాతంగా ఉంటుందని చెబుతున్నారు. విల్లీస్ టవర్స్ వాట్సన్ ఇండియా టాలెంట్ అండ్ రివార్డ్ విభాగం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అయితే.. పెరుగుదల మరీ ఎక్కువగా ఉందన్న మాటను కూడా స్పష్టం చేస్తోంది.

అలా అని అందరి పరిస్థితి ఒకేలా ఉండదన్న మాటను కూడా చెబుతున్నారు. టాలెంట్ కు ఢోకా లేని వారి విషయంలో మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉండదని.. మెరుగైన ప్రతిభ కనపరిచే వారికి ఈ ఏడాది సగటున 20.6 శాతం వేతన పెంపు ఉంటుందన్న మాటను చెబుతున్నారు. ఈ స్థాయిలో వేతనం పెరిగే ఉద్యోగులు మన దేశంలో మొత్తంగా 10.3 శాతం మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.

అయితే.. కొత్త ఉద్యోగాల ఎంపిక మాత్రం మరింత పుంజుకోవాల్సి ఉంటుందని.. కేవలం పది శాతం కంపెనీలు మాత్రమే కొత్త ఉద్యోగాలకు అవకాశం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఈ ఏడాది జీతాల పెంపు విషయంలో మన దేశంతో పాటు.. ఇతర దేశాల వారిని పోలిస్తే.. మన పరిస్థితే మెరుగన్న భావన కలుగక మానదు. ఎందుకంటే.. పొరుగున ఉన్న చైనాలో ఆరు శాతం పెరుగుదలకు అవకాశం ఉందని.. ఇండోనేషియాలో 6.5 శాతం.. ఫిలిప్పీన్స్ లో 5 శాతం.. సింగపూర్ లో 3.5 శాతం.. హాంకాంగ్ లో 3 శాతం వేతన పెంపు ఉంటుందని సర్వే చెబుతోంది.
8 శాతం జీతాలు పెరిగే రంగాలు ఏమంటే..
- టెక్నికల్
- ఔషధ
- కన్జ్యూమర్ ప్రొడక్ట్స్
- రిటైల్
7 శాతం జీతాలు పెరిగే రంగాలు
- ఆర్థిక సేవలు
- తయారీ రంగం
- బీపీవో