Begin typing your search above and press return to search.
పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆ అమ్మాయి గొంతు కోసి చంపేశాడు
By: Tupaki Desk | 1 Nov 2020 10:40 AM ISTపెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆ అమ్మాయి.. స్నేహితుడ్ని కలవటానికి ఇంటి నుంచి బయటకు వెళ్లి.. ఒక ఉన్మాది చేతిలో బలైన దారుణం విశాఖలో చోటు చేసుకుంది. పరిచయస్తుడే ప్రాణాలు తీసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. భయాందోళనలకు గురయ్యేలా చేసింది. చదువుల్లో మేటిగా ఉంటూ.. ప్రేమ పేరుతో బలైన ఈ అమ్మాయి ఉదంతం విన్నంతనే వేదనకు గురి చేయటం ఖాయం.
విశాఖలోని గాజువాకకు చెందిన ఒక అమ్మాయి ఇటీవల ఇంటర్ పూర్తి చేసింది. స్కూల్లో చదువుతున్న సమయంలో ఆమెకు అఖిల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. మూడేళ్లుగా వారి మధ్య వారి మధ్య పరిచయముంది. ఇటీవల కాలంలో ఆ యువతి రాము అనే కుర్రాడితో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయంలో అఖిల్ కు.. రాముకు మధ్య గొడవ కూడా జరిగింది. ప్రేమ పేరుతో అఖిల్ తీరును ఆ అమ్మాయి నో చెబుతోంది. అదే సమయంలో ఆ అమ్మాయి రాముతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని అఖిల్ ఉన్మాదిగా వ్యవహరించాడు.
బాధితురాలి మేనమామ కుమార్తె పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆమె.. బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చింది. శ్రీనగర్ జంక్షన్ వద్ద బాధితురాలు.. రాము మాట్లాడుకుంటూ ఉండగా అఖిల్ వారిద్దరిని చూశాడు. కోపంతో రగిలిపోయిన అతడు.. ఇంటికి వెళ్లి కత్తి వెంట తెచ్చుకున్నాడు. తిరిగి వచ్చేసరికి వారిద్దరు అక్కడే ఉండటం.. యువతి మీదకు నేరుగా దూసుకెళ్లిన అఖిల్.. ఆమె గొంతును కత్తితో కోసేశాడు.
ఏం జరిగిందో అర్థమయ్యేలోపు ఆమె రక్తం ముడగులో చిక్కుకుంది. ఈ పరిణామానికి రాము బిత్తరపోయాడు. వెంటనే అక్కడి నుంచి పరుగెత్తి.. తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన దారుణం గురించి చెప్పాడు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనాస్థలానికి వారు చేరుకున్నారు. ఉన్మాదిగా మారిన అఖిల్ ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.
తీవ్ర గాయాలైన యువతి.. సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. బయటకువెళ్లి వస్తుందనుకున్న కుమార్తె.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వైనంతో బాధితురాలితల్లిదండ్రులో గుండెలు పగిలేలా రోదించారు. వారి వేదన చూసిన వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. రాము స్వయంగా పోలీసులకు వద్దకు వచ్చి లొంగిపోయాడు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రేమ అంటే.. నచ్చింది ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకోవం.. కుదరకపోవటం ప్రాణాలు తీయటం ఎంత మాత్రం కాదన్నది అఖిల్ లాంటి ఉన్మాదులకు ఎప్పటికి అర్థమవుతుందో?