Begin typing your search above and press return to search.
నిన్నటివరకు పేడ తీసే అమ్మాయి..మరికొద్దిరోజుల్లో న్యాయమూర్తిగా తీర్పులు చెప్పబోతోంది!
By: Tupaki Desk | 31 Dec 2020 11:30 PM GMTసోనల్ శర్మ .. అందరిలాగే ఓ దిగువతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి. అయితే కృషి , పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తూ న్యాయమూర్తిగా మరికొద్ది రోజుల్లోనే తీర్పులు చెప్పడానికి సిద్ధమైంది. ఆమె తండ్రి వీధుల్లో చెత్త ఏరుకునేవారు. ఇంటింటికి తిరిగి పాలుపోసేవారు. ఆ సమయంలో వారు ఎన్నో మాటలు అన్నా కూడా నవ్వుతూనే వారికి జవాబు చెప్పేవారు. స్కూలుకు వెళ్లే రోజుల్లో మా నాన్న పాలు అమ్ముకుంటారని చెప్పడానికి సిగ్గుపడేది. కానీ ఈరోజు ఈ కుటుంబంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను అంటూ చెప్తుంది. ఇవి గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు. బాధ, అవమానంనుంచీ సంతోషం, ఆత్మాభిమానం దిశగా సాగిన ఒక విజయ యాత్ర. రాజస్థాన్ లో సరస్సుల నగరంగా పేరొందిన ఉదయపూర్ కు చెందిన సోనల్ శర్మ కథ జీవిత కథ ఇది.
తెల్లవారకముందే పేడ ఎత్తడంతో ప్రారంభమవుతుంది 26 ఏళ్ల సోనల్ దినచర్య. నాలుగో తరగతి నుంచి ఇప్పటివరకూ ఇదే దినచర్య కొనసాగింది. కానీ అతి త్వరలో ఆమె జీవితమే మారబోతుంది. 2018లో సోనల్ శర్మ రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీసెస్ కు సెలక్ట్ అయ్యారు. ఈ పరీక్షా ఫలితాలు గత ఏడాదే వచ్చాయి కానీ సోనల్కు ఒక్క మార్క్ తక్కువ రావడంతో వెయిటింగ్ లిస్ట్ లో ఉంచారు.ఇప్పుడు ఆమెను సెలక్ట్ చేశారు. డిసెంబర్ 29న ఆమె ధ్రువపత్రాల తనిఖీ కూడా పూర్తయింది. 2017లో సోనల్ మొదటిసారి ఆర్ జేఎస్ రిక్రూట్మెంట్ పరీక్షలు రాశారు. కానీ మూడు మార్కుల తేడాతో ఉద్యోగాన్ని అందుకోలేకపోయారు. 2018లో మరో ప్రయత్నం చేశారు. ఈసారి ఒక్క మార్కు తక్కువ వచ్చి వెయిటింగ్ లిస్ట్ లో చేరారు. ఈ ఏడాది నవంబర్లో వెయిటింగ్ లిస్ట్ నుంచి ఆమెను జడ్జి ఉద్యోగానికి సెలక్ట్ చేసినట్లు తెలిసింది. తరువాత వెంటవెంటనే డాక్యుమెంట్ల వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ జరిగిపోయాయి. ఒక సంవత్సరం ట్రైనింగ్ తరువాత ఆమె జడ్జిగా సేవలు ప్రారంభిస్తారు.
నేను అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాను. అందరు పిల్లల్లాగే నాకు కూడా నాన్నతో బయటికెళ్లడం సరదాగా ఉండేది.మా నాన్న ఇంటింటికీ తిరిగి పాలు పోసేవారు. ఏ ఇంటికి వెళ్లినా ఏదో ఒక వంక పెట్టి అందరూ నాన్నను తిడుతుండేవారు.అన్ని అవమానాలు భరిస్తూ కూడా నాన్న వాళ్లకు చిరునవ్వుతో జవాబు చెప్పేవారు.ఒకరోజు నాన్నతో పాలు అమ్మడానికి బయటికెళ్లి వచ్చిన తరువాత, నేనింక నాన్నతో బయటకి వెళ్లను, నాకు సిగ్గుగా ఉంది అని అమ్మతో చెప్పాను.సిగ్గు ఎందుకంటే మావల్లే మా నాన్న అన్ని అవమానాలు భరిస్తున్నారు కాబట్టి. మమ్మల్ని చదివించడానికే నాన్న అంత కష్టపడుతున్నారు. కానీ ఈరోజు ఆయన తపస్సు ఫలించింది. అన్ని కష్టాల్లో కూడా నవ్వుతూ పోరాడుతూ ముందుకు సాగిన నాన్నను చూసాకే నాకు మరింత పట్టుదల వచ్చింద అని సోనల్ తెలిపారు. సోనాల్ ఉదయ్పూర్లోనే స్కూలు, కాలేజీ విద్యాభ్యాసం పూర్తిచేశారు.
మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయంనుంచీ న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.ఆ సమయంలో ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూనే యూనివర్సిటీలో చదువు కొనసాగించారు.పది పన్నెండు తరగతుల్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయంనుంచీ బీఏ ఎల్ ఎల్ బీ లో బంగారు పతకం అందుకోవడమే కాకుండా భామాషా అవార్డ్ కూడా అందుకున్నారు. యూనివర్సిటీ టాపర్ గా నిలిచినందుకు ఆమెకు ఛాన్సలర్ అవార్డ్ కూడా లభించింది. జడ్జి కావాలన్న కూతురి కలలు సాకారం కావడంతో ఖ్యాలీ లాల్ శర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ.. తీర్పు చెప్పడంలో ఎప్పుడూ ఒత్తిడికి లొంగిపోవద్దు. అవతలివారు ఎవరైనా సరే న్యాయమే గెలవాలి. తప్పు చేసినవారికి శిక్ష పడాలి అని తన కూతురికి చెప్పారు.కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని సోనల్ శర్మ రుజువు చేశారు.