Begin typing your search above and press return to search.

బాయ్ ఫ్రెండ్ తో సినిమాకు వెళ్లి.. కిడ్నాప్ కథ అల్లేసింది

By:  Tupaki Desk   |   25 Jan 2020 4:30 AM GMT
బాయ్ ఫ్రెండ్ తో సినిమాకు వెళ్లి.. కిడ్నాప్ కథ అల్లేసింది
X
కిరాణా షాపునకు వెళ్లిన అమ్మాయి గంటలవుతున్నా రాకపోవటం.. ఫోన్ చేస్తే.. తనను నలుగురు కిడ్నాప్ చేసినట్లుగా చెప్పిన అమ్మాయి ఉదంతం సంచలనం గా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగర శివారు లో చోటు చేసుకున్న ఈ ఉదంతం పెను సంచలనంగా మారటమే కాదు.. కొందరైతే అత్యుత్సాహం తో మరో దిశ ఘటన కు దగ్గరగా ఉన్నట్లు గా హడావుడి చేసేశారు.

అమీన్ పూర్ ఘటన గా పాపులర్ అయిన ఈ వ్యవహారంపై పోలీసులు తాజాగా సంచలన నిజాల్ని వెల్లడించారు. బాధితురాలు చెప్పినట్లుగా.. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి మియాపూర్ కు సినిమాకు వెళ్లిన ఆమె.. ఎందుకింత ఆలస్యమైందని తల్లి నిలదీయటంతో కిడ్నాప్ కథను అప్పటికప్పుడు ఆల్లేసిందని తేల్చారు.

అమీన్ పూర్ పరిధి లోని వాణినగర్ కాలనీలో నివాసం ఉండే ఒక జంట వాచ్ మెన్ గా వ్యవహరిస్తుంటారు. పది రోజుల క్రితం ఊరు నుంచి వారి పదహారేళ్ల కుమార్తె అమీన్ పూర్ కు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి తరఫు ప్రచారం చేయటానికి వెళ్లింది. ఈ సందర్భంగా ఆమెకు సందీప్ అనే యువకునితో పరిచయమైంది. వీరిద్దరూ కలిసి గురువారం మియాపూర్ లో సినిమాకు వెళ్లారు. మధ్యాహ్నం బైకు మీద తిరిగి వస్తున్న వేళ.. ఆ అమ్మాయి తల్లి ఫోన్ చేసి.. ఎక్కడున్నావని అడిగింది.

దీంతో.. నిజం చెబితే సమస్య వస్తుందని భావించిన ఆ అమ్మాయి.. తనను నలుగురు కిడ్నాప్ చేశారని.. నగర శివారుకు తీసుకొచ్చినట్లుగానోటికి వచ్చినట్లుగా అబద్ధం చెప్పేసింది. దీంతో.. ఇదో ఇష్యూలా మారింది. అమ్మాయిని వారి తల్లిదండ్రులకు తెలీకుండా సినిమాకు తీసుకెళ్లినందుకు యువకుని పైన ఫోక్సో చట్టం ప్రకారం కేసును నమోదు చేశారు. వీరిద్దరూ కలిసి బైక్ మీద వెళ్లిన సీసీ కెమేరా ఫుటేజ్ కు సంబంధించిన కొన్ని ఫోటోల్ని పోలీసులు విడుదల చేశారు.