Begin typing your search above and press return to search.
రాసలీలల సీడీలో మరో మలుపు.. తెరపైకి యువతి తండ్రి
By: Tupaki Desk | 17 March 2021 12:39 PM GMTఇప్పటికే పలు మలుపులు తిరిగిన కర్ణాటక రాసలీలల సీడీ వ్యవహారం మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఈ ఇష్యూ మొత్తానికి కేంద్రంగా మారిన యువతి.. సీడీ విడుదలైన నాటి నుంచి కనిపించకుండా పోవటం తెలిసిందే. ఆమె కోసం అధికారులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఇలాంటివేళ.. ఈ సీడీలో కనిపిస్తున్న యువతి తండ్రి నిన్న బెళగావి పోలీసులకు.. తన కుమార్తె కిడ్నాప్ అయినట్లుగా పేర్కొంటూ.. తన కుమార్తె జీవితం ప్రమాదంలో పడినట్లుగా ఒక ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు.
టీవీలో వీడియోను చూసినపంతనే తన కుమార్తెకు ఫోన్ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే.. అందులో ఉన్నది తాను కాదని తన కుమార్తె చెప్పారన్నారు. అది నకిలీ వీడియో అని.. తాను ఏ తప్పు చేయలేదన్న ఆమెను ఇంటికి రావాలని తాను కోరినట్లుగా చెప్పారు. ‘నీ తప్పు ఏమీ లేనప్పుడు ఇంటికి రమ్మన్నాను. తన జీవితం ప్రమాదంలో ఉన్నట్లుగా తాను పేర్కొంది. ఆ తర్వాత ఫోన్ చేస్తే.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. తను ఎక్కడ ఉందో తెలీటం లేదు. తను ప్రమాదంలో ఉంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమార్తెను మార్చి2న బెంగళూరులోని హాస్టల్ నుంచి అపహరించినట్లుగా యువతి తండ్రి ఫిర్యాదు చేశారు.
కర్ణాటక మంత్రి రమేశ్ తో ఒక యువతి రాసలీలలుసాగించినట్లుగా వీడియో ఉండటం.. ఉద్యోగం ఇప్పిస్తానన్న ఆశ చూపి.. ఇలా మోసం చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో... ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన యువతి ఒక వీడియోను విడుదల చేశారు. అందుతో తన కుటుంబ సభ్యులకు.. తనకు ప్రాణహాని ఉందని.. తాను.. తన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా పేర్కొంది. తనకు రక్షణ కల్పించాలని కోరింది.
రాసలీలల సీడీ విడుదలకు ముందు ఆ యువతి నలుగురితో కలిసినట్లుగా అధికారులు గుర్తించారు. టీవీలో సీడీ టెలికాస్ట్ అయ్యాక.. ఆమె బెంగళూరు నుంచి గోవా వెళ్లారని.. ఆ తర్వాత శివారులో తలదాచుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె కోసం తీవ్రంగా గాలింపులు జరుపుతున్న సమయంలోనే ఒకటి తర్వాత ఒకటిగా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే యువతి బాయ్ ఫ్రెండ్ తో పాటు అతని స్నేహితుడ్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారిని ఎక్కడ విచారిస్తున్నారన్న వివరాల్ని పోలీసులు వెల్లడించటం లేదు. తాజాగా యువతి కిడ్నాప్ అయ్యిందంటూ ఆమె తండ్రి బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఐపీసీ సెక్షన్ 363, 368, 343, 346, 354, 506ల కింద కేసు నమోదు చేశారు.
యువతి తండ్రి చెప్పిన ప్రకారం.. తన కుమార్తెతో సాగిన ఫోన్ కాల్ సంభాషణ ఇలా సాగింది.
టీవీలో ఆ వీడియో ప్రసారం కాగానే.. నేను నా కుమార్తెకు కాల్ చేశాను.
యువతి తండ్రి: టీవీలో ఓ వీడియో వస్తుంది.. దానిలో ఉన్న యువతి చూడటానికి అచ్చం నీలానే ఉంది.
యువతి: వీడియో గురించి నాకు ఏం తెలియదు. అందులో ఉన్నది నేను కాదు.. అది ఫేక్ వీడియో అయి ఉండొచ్చు. నేను ఏ తప్పు చేయలేదు.
యువతి తండ్రి: నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంటికి రా.
యువతి: రాలేను.