Begin typing your search above and press return to search.
అమ్మాయే తాళి కడుతుంది.. ప్రేమికుల రోజునే పెళ్లి.. ఇష్టారీతిన కుదరదు.. ఆంధ్రప్రదేశ్ లోనే ఈ వింత
By: Tupaki Desk | 16 Feb 2021 12:45 PM GMT'పెళ్లిలో ఎవరు తాళికడతారు?' అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? సమాధానం చెప్పడం వదిలేసి, ఇదేం తింగరి ప్రశ్న అన్నట్టుగా చూస్తారు కదా..! కానీ.. ఇది సరైన ప్రశ్నే. ఎందుకంటే.. ఆ ఊళ్లో పెళ్లి కూతురే.. వరుడి మెడలో తాళి కడుతుంది మరి! ఇదొక్కటేనా.. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయక్కడ. ఎవరైనా.. వారికి నచ్చిన ముహూర్తానికి, నచ్చిన పద్ధతిలో పెళ్లి చేసుకుంటారు.. కానీ, అక్కడ అలా కుదరదు. ఏ పెళ్లైనా ఒకే సమయంలో జరగాలి. అది కూడా ఒకే పద్ధతిలో జరగాలి. వీటికే షాక్ అవుతున్నారా? ఇంకా చాలా ఉన్నాయ్.. రండి, ఆ విశేషాలేంటో చూద్దాం...
ఆ ఊరి పేరు నువ్వలరేవు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా, వజ్రపు కొత్తూరు మండలం పరిధిలో ఉంటుంది. అదొక మత్స్యకారుల గ్రామం. ఇక్కడ పెళ్లిళ్లే కాదు.. అన్ని సాంప్రదాయాలూ భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ప్రతీ రెండు లేదా మూడేళ్ళకు ఒకసారి మాత్రమే పెళ్లిళ్లు జరుగుతాయి. అది కూడా ఒకే ముహూర్తానికి సామూహికంగా వివాహాలు జరుగుతాయి.
ఈ పద్ధతి నిన్నా మొన్న వచ్చింది కాదు.. దాదాపు 400 సంవత్సరాలుగా అమలవుతోందని చెబుతున్నారు స్థానికులు. ఇక్కడ ఆదాయం అందరికీ తక్కువే. చేపల వేట మీదనే అందరూ ఆధారపడతారు. అందువల్ల సామూహిక వివాహాలతో ఖర్చు తగ్గించుకోవచ్చని భావించారు పురాతన కాలం నాటి పెద్దలు. ఇది అందరికీ బాగా నచ్చింది. దీంతో.. ఇప్పటికీ అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. బంధువులు అందరికీ ఒకేసారి విందు ఇవ్వడం.. పెళ్లి ఖర్చులు అందరం భరించడం వల్ల డబ్బు ఆదా అవుతుందని చెప్తున్నారు స్థానికులు.
పెళ్లిళ్లు చేయాలని అందరూ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత అన్నీ.. ఒకే రోజు, ఓకే ముహూర్తానికి జరిపిస్తారు. అన్ని వివాహాలు కూడా వధువు ఇంట్లోనే జరుగుతాయి. అయితే.. సాధ్యమైనంత వరకు ప్రేమికుల దినోత్సవం రోజున పెళ్లిళ్లు జరిపిస్తారు. ఇక్కడ 2014లో 200 జంటలకు వివాహం కాగా.. 2017లో 103 జంటలకు పెళ్లి చేశారు. 2019లో 100 పెళ్లిళ్లు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన 42 జంటలు పెళ్లి చేసుకున్నాయి.
పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించినప్పుడు గ్రామంలోని యువతీ యువకులను పెద్దలు పిలిచి వారు ఎవరినైనా ప్రేమించారా? అని కూడా అడుగుతారు. వారు ఎవరినైనా ఇష్టపడితే.. ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తారు. అంతేకాదు.. ప్రధానంగా మూడు ఇంటి పేర్లు కలిగిన వారే ఈ గ్రామంలో ఎక్కువగా ఉన్నారు. వారి మధ్యే పెళ్లిళ్లు జరుగుతాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఆ ఊళ్లో వారు పెళ్లి చేసుకోరు. ఇక, ఇక్కడి ఆచారాల్లో అత్యంత వింతైనది పెళ్లి తంతు. వివాహ సమయంలో అబ్బాయి మెడలో అమ్మాయి తాళి కడుతుంది.
ఈ గ్రామం ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో ఉంటుంది. అందువల్ల పెళ్ళిలో ఒడిషా సంప్రదాయాలు కనిపిస్తాయి. ఇక, ఈ గ్రామంలో అందరూ పెద్దలమాటకి కట్టుబడి ఉంటారు. అంతేకాదు.. ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడూ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. గ్రామ పెద్దలు నిర్ణయించిన వ్యక్తిని వారు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అలాగని, ఇది చిన్న గ్రామం ఏమీ కాదు. దాదాపు 12 వేల జనాభా ఉంది. ఇప్పటి వరకు ఈ ఊళ్లో పెళ్లిళ్ల విషయంలో చిన్న గొడవ కూడా జరగలేదట. నిజంగా.. భలేగా ఉంది కదూ ఈ సాంప్రదాయం..?!