Begin typing your search above and press return to search.
ఊరిచివర గుడిసెలో ఒంటరిగా బాలిక.. గ్రామస్థుల షాకింగ్ నిర్ణయం
By: Tupaki Desk | 28 March 2021 11:30 AM GMTతెలంగాణలో కరోనా కలకలం చెలరేగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అంతటా ఆందోళన నెలకొంది. కొద్దిరోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజలు, ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
కరోనా సోకిన వారు చాలా మంది హోం ఐసోలేషన్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కరోనా సోకిన ఓ విద్యార్థినిని గ్రామస్థులు ఊరి చివర గుడిసెలో ఒంటరిగా ఉంచడం దుమారం రేపింది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాలెగూడకు చెందిన ఓ గిరిజన బాలికకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామస్థులు ఓ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామ శివారులో ప్రత్యేకంగా ఓ గుడిసెను ఏర్పాటు చేసి బాలికకు అక్కడే ఆశ్రయం కల్పించారు. ఆమెకు ఆహారంతోపాటు ఇతర ఏర్పాట్లు గ్రామస్థులే దగ్గరుండి చూసుకుంటున్నారు. రాత్రివేళ ఆమెకు తోడుగా గ్రామస్థులే భౌతిక దూరం ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్ పూర్ మండల కేంద్రంలోని బాలిక ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఈ బాలికకు సోకినట్టు తెలుస్తోంది.
కాగా బాలికను ఊరికి దూరంగా ఒంటరిగా పెట్టడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. కరోనా ప్రాణాలు తీసే వ్యాధి కాదని.. ఎందుకీ అమానుషం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.