Begin typing your search above and press return to search.

వయాగ్రా కోసం వెళ్లిన నలుగురు మహిళలు గల్లంతు

By:  Tupaki Desk   |   3 May 2023 6:12 PM GMT
వయాగ్రా కోసం వెళ్లిన నలుగురు మహిళలు గల్లంతు
X
శృంగార సామర్థ్యం పెంచడంతో పాటు పురుషులకు మరియు స్త్రీలకు లేటు వయసులో ఎక్కువ శక్తిని ఇచ్చే అద్భుతమైన మూలికగా హిమాలయన్ వయాగ్రా ను నేపాల్ వారు పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ మరియు మే నెలల్లో మంచు ప్రాంతాల్లో హిమాలయన్‌ వయగ్రా కోసం పెద్ద ఎత్తున జనాలు వెళ్తారు.

ప్రతి సంవత్సరం కూడా వయాగ్రా కోసం వెళ్లిన వారిలో ఒకరు ఇద్దరు అయినా గల్లంతు అవుతూ ఉంటారు. అక్కడి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నేపాల్‌ లోని దార్చులా జిల్లాకు చెందిన వారు వయగ్రా ను వెదికేందుకు వెళ్తూ ఉంటారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున మంచు ప్రాంతానికి వయగ్రాని వెతికేందుకు గాను వెళ్లారని తెలుస్తోంది.

ఇటీవల స్థానికులు అయిదుగురు వయగ్రా ను వెతుకుతూ వెళ్లారు. వారు దార్చులా జిల్లాలో ఉన్న అధిక మంచు ప్రాంతంలో కనిపించకుండా పోయారు అంటూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కనిపించకుండా పోయిన అయిదుగురు కోసం అధికారులతో పాటు స్థానికులు వెతుకుతున్నారు.

కనిపించకుండా పోయిన అయిదుగురిలో నలుగురు ఆడవారు ఉండగా ఒక్కరు పురుషుడు. మంచు ప్రాంతాల్లో లభించే ఈ వయగ్రా కి అత్యంత డిమాండ్ ఉంది. అందుకే ప్రాణాలకు తెగించి ప్రతి సంవత్సరం వెతికేందుకు వెళ్తూ ఉంటారు. గల్లంతు అయిన అయిదుగురు కూడా గతంలో వయగ్రా కోసం వెళ్లి వచ్చిన వారే అంటూ స్థానికులు చెబుతున్నారట.