Begin typing your search above and press return to search.

నయీం కేసులో మరో సంచలనం

By:  Tupaki Desk   |   23 Jun 2020 2:30 PM GMT
నయీం కేసులో మరో సంచలనం
X
నయీం.. ఈ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ ను 2016 ఆగస్టులో ఎన్ కౌంటర్ లో తెలంగాణ పోలీసులు చంపేశారు. ఆ తర్వాత నయీం ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి అందరూ షాక్ అయ్యారు. నయీం ఎందరినో చంపాడని.. వేల ఎకరాల భూములను కబ్జా చేశాడని.. చాలా మందిని బెదిరించాడని.. ఈ కేసులు పోలీసులు, ప్రజాప్రతినిధులకు హస్తం ఉందని కథనాలు వెలువడ్డాయి.

నయీం బాధుతులు అందరూ బయటకు వచ్చి అతడు చేసిన ఘోరాలను చెప్పుకొచ్చారు. దీంతో నయీం కేసును సీబీఐతో కానీ విజిలెన్స్ తో కానీ విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ వచ్చింది.

తాజాగా నయీం కేసును లోక్ పాల్ చట్టం కింద విచారించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. నయీం కేసులో నాలుగు రాష్ట్రాల పోలీసులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అందుకే లోక్ పాల్ కిందకు తీసుకురావాలని కోరింది. నయీం కేసులో ఇప్పటికీ తేలని అంశాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. నయీం డైరీ, భూములతో పాటు డబ్బులకు సంబంధించిన డంప్ ఎక్కడ ఉందో తేల్చాలని కోరింది.

నయీంకు 1050 ఎకరాల భూములున్నాయని.. 2 కిలోల బంగారం, 2 కిలోల వెండిని పోలీసులు తేల్చి స్వాధీనం చేసుకున్నారు. నయీం అనుచరుల నుంచి 2.16 కోట్లను సీజ్ చేశారు.