Begin typing your search above and press return to search.
సంచలనంగా మాజీ సీఎం కుమార్తె వాయిస్ మెసేజ్
By: Tupaki Desk | 16 Aug 2019 8:05 AM GMTఆర్టికల్ 370 నిర్వీర్యం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. జమ్ముకశ్మీర్ ప్రాంతంలో ఆంక్షలు అమలు చేస్తున్నా.. జమ్ములో పరిస్థితి సద్దుమణిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో లద్దాఖ్ లో కూడా పరిస్థితి నార్మల్ గా ఉంది. అయితే.. కశ్మీర్ వ్యాలీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రగులుతున్న అగ్నిపర్వతంలా ఉన్న కశ్మీరీలు.. మోడీ సర్కారు తీసుకున్ననిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.
భారీగా మొహరించిన భద్రతా దళాల మధ్య కశ్మీరీ వ్యాలీలో ఆంక్షల రాజ్యం నడుస్తోంది. మరోవైపు జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబాలుగా పేరుతో పాటు.. మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్న మొహబూబా ముఫ్తీ .. ఒమర్ అబ్దుల్లాలతో పాటు పలువురు సీనియర్ నేతల్ని అదుపులోకి తీసుకొని హౌస్ అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేసి పది రోజులైంది. ఇప్పటివరకూ వారిని విడుదల చేయలేదు. ఇలాంటి వేళ.. ముఫ్తీ కుమార్తె సనా ఇల్తిజా జావెద్ తాజాగా మాట్లాడారు. తన వాయిస్ మెసేజ్ ను ఆమె విడుదల చేశారు.
ఈ మెసేజ్ ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో .. తాను మీడియాతో మాట్లాడితే చంపేస్తానని బెదిరిస్తున్నారని.. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి అమిత్ షా రియాక్ట్ కావాలన్నారు. యావత్ దేశం మొత్తం సంతోషంగా పంద్రాగస్టు వేడుకల్ని జరుపుకుంటుంటే.. కశ్మీర్ ప్రజలు మాత్రం జంతుల మాదిరి ఒక బోనులో బంధించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు మానవ హక్కులు కోల్పోయారని.. జమ్ముకశ్మీర్ విభజన సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం కాకుండా ఉండేందుకు తమ రాష్ట్రంలో సమాచార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు.
బయట ప్రపంచంలో తమ సంబందాల్ని నిలిపివేసి.. తమ గొంతుల్ని నొక్కేశారన్నారు. కేంద్రం తీరును ఆమె తప్పు పట్టారు. కర్ఫ్యూ విధించిన నాటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తాను మీడియాకు తెలిపానని.. వెంటనే తనను నిర్బందించారన్నారు. ఈసారి ఇదే విషయాలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారన్నారు. వాళ్లు నన్ను చంపేస్తారేమో? అన్న భయాందోళనల్ని వ్యక్తం చేశారు. ఆమెదిగా చెబుతున్న ఆడియో క్లిప్ ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. దీనిపై అమిత్ షా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.