Begin typing your search above and press return to search.

ట్రంప్ కు టైం బాగోలేదన్నది ఈగ కూడా చెప్పేసిందా?

By:  Tupaki Desk   |   9 Oct 2020 8:00 AM GMT
ట్రంప్ కు టైం బాగోలేదన్నది ఈగ కూడా చెప్పేసిందా?
X
చాలా సందర్భాల్లో చిన్న విషయాలు పెద్దగా మారుతుంటాయి. అత్యంత శక్తివంతులకు చిరాకు తెప్పిస్తుంటాయి. అమెరికా అధ్యక్ష.. ఉపాధ్యక్ష ఎన్నికల కారణంగా అక్కడి రాజకీయాలు హాట్ హాట్ గా మారిన వేళ.. ఒక ఈగ చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా.. అధ్యక్ష పదవికి పోటీ చేసేవారు.. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల మధ్య ముఖాముఖి చర్చ జరుగుతుంది. ఈ సందర్బంగా తమ ప్రాధామ్యాల గురించి ప్రస్తావిస్తూ.. ప్రత్యర్థి పార్టీ తీరును తప్పు పడతారు. ఈ చర్చ సందర్భంగా ఎవరి వాదన ఏమిటి? ఎవరేం చేయాలనుకుంటున్నారన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటానికి అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు.

తాజాగా అలాంటిదే అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ పెన్స్.. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హ్యారీస్ మధ్య ముఖాముఖి చర్చ జరిగింది. అత్యంత భారీగా చేపట్టిన భద్రతా చర్యలు చేపట్టినప్పటికి.. ఒక ఈగ ప్రత్యక్షం కావటం.. అది ఏకంగా రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ తల మీద కూర్చోవటంతో అదో చర్చగా మారింది.

దాదాపు రెండు నిమిషాల వరకు అభ్యర్థి తల మీద వాలిన ఈగను ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తితో వీక్షించటంతో పాటు.. తర్వాత ఇదే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చర్చ సందర్భంగా ఇరువురు అభ్యర్థులు ఏమేం మాట్లాడారు? ఏం చెప్పారన్నది వదిలేసి.. మైక్ తల మీద వాలిన ఈగ మీద వ్యాఖ్యలు చేయటం షురూ చేశారు. చర్చలో ఈగే గెలిచినట్లుగా పలువురు తేల్చేశారు.

ఒక నెటిజన్ కాస్త చొరవ తీసుకొని.. మైక్ పెన్స్ ఫ్లై పేరుతో తెరిచిన ట్విట్టర్ ఖాతాకు నిమిషాల్లో 60వేల మంది ఫాలోవర్లు కావటం గమనార్హం. ఇప్పటికే పలు సమస్యలు ఎదుర్కొంటున్న రిపబ్లికన్ల అభ్యర్థులకు.. తాజాగా ఈగ సైతం తమ మీద పగబట్టినట్లుగా మారిందంటున్నారు. ఆ ఈగ ఏదో డెమొక్రాట్ల అభ్యర్థి మీద వాలకుండా మావోడి తల మీద వాలి.. రచ్చ చేసిందే అంటూ వాపోతున్నారు. ట్రంప్ వారి పార్టీకి టైం ఏ మాత్రం బాగోలేదన్న విషయాన్ని తాజాగా ఈగ కూడా ముందే సంకేతాల్ని ఇచ్చేసిందా? అన్న వాదనను వినిపించటం గమనార్హం.