Begin typing your search above and press return to search.

ఆ ఐదుగురు ఐఎఎస్‌లకు హైకోర్టులో ఊరట

By:  Tupaki Desk   |   23 Sep 2021 1:30 PM GMT
ఆ ఐదుగురు ఐఎఎస్‌లకు హైకోర్టులో ఊరట
X
2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్‌ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌ లపై సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. బాధితులకు ఇప్పటికే పరిహారం అందినట్లు ఐఏఎస్‌ లకు కోర్టుకు తెలపడంతో ఈ కేసులో తీర్పును సస్పెండ్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్ సింగ్‌, ఐఏఎస్‌ అధికారి ముత్యాల రాజు, శేషగిరి బాబు, కెవీఎన్‌ చంద్రధర్‌ బాబు వేసిన అప్పీల్‌ ను స్వీకరించిన హైకోర్టు, భూ పరిహారం పూర్తిగా అప్పటికే చెల్లించడంతో పాటు తమవంతుగా అధికారులు కోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రయత్నించారని భావిస్తున్నట్టు పేర్కొంది.

2వ తేదీన ఐదుగురు ఐఏఎస్‌ లకు జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది కోర్టు.. జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజులు శిక్ష సస్పెండ్‌ చేసింది. 2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్‌ అధికారులకు కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా.

ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌ సింగ్‌ రావత్‌ కి నెలరోజుల జైలు, రూ.2వేల జరిమానా, అప్పటి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.1000 జరిమానా, అప్పటి మరో కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్‌ ఎన్‌ వీ చక్రధర్‌ లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం తీర్పు వెలువరించారు. అప్పీల్‌ కు వెళ్లేందుకు వీలుగా న్యాయమూర్తి తన తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలుపుదల చేశారు. నెల్లూరు జిల్లా తాళ్ళపాకకు చెందిన మహిళకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై సీరియస్‌ అయిన హైకోర్టు, ఏఎండీ ఇంతియాజ్‌కు రెండు వారాల జైలుశిక్ష, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ కు నెల రోజుల జైలుశిక్ష, ముత్యాలరాజుకు రెండువారాల జైలు శిక్ష విధించింది. ఇక, మాజీ ఐఏఎస్‌ మన్మోహన్‌సింగ్‌కు నెల రోజుల జైలు శిక్ష విధించిన హైకోర్టు, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ శేషగిరిరావుకు రెండు వారాల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు సింగిల్‌ బెంచ్ జడ్జి ఆర్డర్స్‌ను డివిజన్‌ బెంచ్‌ నిలిపివేయడంతో.. వారికి ఊరట లభించింది.