Begin typing your search above and press return to search.

'వ్యాక్సిన్ డే ' .. తోలి వ్యాక్సిన్ భారత సంతతి వ్యక్తికే !

By:  Tupaki Desk   |   8 Dec 2020 6:56 AM GMT
వ్యాక్సిన్ డే  .. తోలి వ్యాక్సిన్ భారత సంతతి వ్యక్తికే !
X
యూకే లో కరోనా వ్యాక్సిన్ వితరణ ఈ రోజు నుండి ప్రారంభం అయింది. ఈ మద్యే బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్, బయోఎన్‌ టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ‌ను అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనితో వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, తొలి టీకా మాత్రం ఓ భారత సంతతి వ్యక్తి వేయించుకోబోతున్నారు.

బ్రిటన్ లోని టైన్ అండ్ వేర్ మెట్రోపాలిటన్‌ లో నివాసం ఉంటున్న 87 ఏళ్ల హరి శుక్లా మంగళవారం న్యూ క్యాజిల్ ఆస్పత్రిలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్‌లో భాగంగా మొదటి డోసు మంగళవారం ఇవ్వనున్నారు. కాగా, టీకా తీసుకోవడం తన బాధ్యత అని ఈ సందర్భంగా శుక్లా తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు బలిగొన్న మహమ్మారికి మనం ముగింపు పలికే దశకు చేరుకోవడం సంతోషంగా ఉంది. టీకా తీసుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. వ్యాక్సిన్ తీసుకుని నా వంతు పాత్ర పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కరోనా విజృంభణ సమయంలో మనల్ని సురక్షితంగా ఉంచడానికి ఎన్‌ హెచ్ ఎస్ వారు చేసిన కృషికి ధన్యవాదాలు అని శుక్లా అన్నారు.ఇక యూకేలో ఇవాళ్టితో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తున్న క్రమంలో ఈ మంగళవారాన్ని అక్కడ "వ్యాక్సిన్ డే " లేదా టీకా దినోత్సవంగా పిలుస్తున్నారు. దీన్ని చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమంగా యూకే అభివర్ణించింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇదొక భారీ ముందడుగు అని అన్నారు.