Begin typing your search above and press return to search.

దీని ముందు కరోనా పిల్లకాకి.. దేశంలో తొలిసారి జాడ గుర్తించిన శాస్త్రవేత్తలు

By:  Tupaki Desk   |   19 March 2021 5:30 AM GMT
దీని ముందు కరోనా పిల్లకాకి.. దేశంలో తొలిసారి జాడ గుర్తించిన శాస్త్రవేత్తలు
X
ప్రపంచాన్ని వణికించిన కరోనా సైతం ఆ ఫంగస్ ముందు పిల్లకాకిగా చెబుతారు. మిస్టరీ అన్న పదానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండే ఒక ప్రమాదకర ఫంగస్ ను తాజాగా ఢిల్లీ వర్సిటీ శాస్త్రవేత్త దేశంలో గుర్తించారు. అండమాన్ దీవుల్లోని ఒక చోట దీని ఆనవాళ్లను కనిపెట్టారు. దేశంలో తొలిసారి గుర్తించిన ఈ ప్రమాదకర ఫంగస్ ఔషధాలకు లొంగదని.. అసలు ఎక్కడ పుట్టింది? ఎప్పుడు పుట్టింది? అన్న విషయాలు కూడా తెలీవని.. తొలిసారి దీన్ని జపాన్ లో గుర్తించినట్లు చెబుతారు.

ఇంత మిస్టరీ ఫంగస్.. తొలిసారి దేశంలో గుర్తించటంతో శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఇంతకీ దీని పేరేమిటంటారా? అక్కడికే వస్తున్నాం. దీని పూర్తి పేరు క్యాండిడా ఆరిస్. సింఫుల్ గా సీ.ఆరిస్ అంటారు. కొద్దిమంది దీన్ని సూపర్ బగ్ అని కూడా వ్యవహరిస్తారు. కరోనా కంటే సూపర్ డేంజర్ అయిన ఈ ఫంగస్ వ్యాపిస్తే.. ఏడాదిలో కోటి మందిని చంపేస్తుందన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.

ఇంతటి ప్రమాదకరమైన ఫంగస్ ను దేశంలో తొలిసారి గుర్తించారు. ఢిల్లీ వర్సిటీకి చెందిన అనురాధ చౌదరి ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల టీం అండమాన్ దీవుల్లో పర్యటించింది. అక్కడి ఎనిమిది దీవుల్లోని 8 ప్రాంతాల్లో మట్టి.. నీటి నమూనాలను సేకరించింది. ఇందులో రెండు ప్రాంతాల్లో సీ.ఆరిస్ ఆనవాళ్లను గుర్తించారు.
ఈ రెండు శాంపిళ్లలో ఒకటి,. జనసంచారం ఎక్కువగా ఉండే బీచ్ ఒకటిగా గుర్తించారు. ఫంగస్ ఇక్కడే పుట్టిందా? లేదంటే మనుషుల నుంచి ఇక్కడకు చేరిందా?అన్నది తేలాల్సి ఉంది. ఈ ఫంగస్ ఎలా వ్యాపిస్తుందన్న విషయంపై శాస్త్రవేత్తలకు ఇప్పటికి ప్రశ్నలే తప్పించి.. సమాధానాలు దొరకని దుస్థితి. వాతావరణంలో మార్్పులు.. ఉష్ణోగ్రతల పెరుగుదలే దీనికి కారణమని చెబుతారు. ఈ వైరస్ ను తొలిసారి జపాన్ లోని ఒక రోగి శరీరంలో గుర్తించారు.

దీని ప్రత్యేకత ఏమంటే.. మనిషి శరీరంపై చేరిన ఫంగస్ అక్కడే ఉండిపోతుంది. ఎప్పుడైనా గాయం అయినప్పుడు దాని ద్వారా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇన్ ఫెక్షన్ కలిగిస్తుంది. వైరస్ లోపలకు వెళ్లినంతనే తన ప్రభావాన్ని చూపించదు. కొద్దిరోజుల తర్వాత తీవ్రమైన చలిజ్వరం వస్తుంది. అనంతరం మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మందులకు లొంగని దీని కారణంగా ప్రాణాపాయమే ఎక్కువ. దీని ముందు కరోనా పిల్లకాకిగా కొందరు అభివర్ణిస్తుంటారు.