Begin typing your search above and press return to search.
భారత్ కి తొలిసారి తాలిబన్ల లేఖ .. ఎందుకంటే
By: Tupaki Desk | 30 Sep 2021 2:30 AM GMTఆఫ్ఘనిస్థాన్ లో మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్లు తొలిసారి భారత ప్రభుత్వానికి అధికారికంగా ఓ లేఖ రాశారు. రెండు దేశాల మధ్య విమానాలను పునరుద్ధరించాలని ఆ లేఖలో తాలిబన్లు కోరారు. ద ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ పేరుతో ఈ లేఖ వచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అరుణ్ కుమార్‌కు తాలిబన్లు ఈ లేఖను పంపించారు. ఆఫ్ఘనిస్థాన్ పౌర విమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హాజ్ హమీదుల్లా అకున్ జదా ఈ లేఖను రాశారు.
సెప్టెంబర్ 7వ తేదీన ఈ లేఖ రాసినట్లుగా ఉంది. మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య అమెరికా బలగాలు తిరిగి వెళ్లిపోయే సమయంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ ను దెబ్బతీశారు. అయితే ఖతార్ సాంకేతిక సాయంతో ఎయిర్ పోర్ట్ ను పునరుద్ధరించాము. ఈ మేరకు ఎయిర్ మెన్ కు నోటీసును ఈ నెల 6న జారీ చేశాము అని ఆ లేఖలో హమీదుల్లా రాశారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య విమానాలను పునరుద్ధరించాలని కోరారు. రెండు దేశాల మధ్య ప్రయాణం సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నాము. మా అధికారిక ఎయిర్ లైన్స్ అయిన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్, కామ్ ఎయిర్ తమ విమానాలను తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నాయి. వారి వాణిజ్య విమానాలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాము అని ఆ లేఖలో హమీదుల్లా కోరారు.
ఆగస్టు 31 న దోహాలో సమావేశం జరిగినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలనను భారతదేశం అధికారికంగా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ అరాచక పాలనను ఇండియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్, దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ అధిపతి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్‌జాయ్‌ని కలిసి చర్చలు జరిపిన తర్వాత కూడా భారత్ ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ పాలనపైన గుర్రుగానే ఉంది. భారత్ కు తాలిబన్లతో ప్రమాదం పొంచి ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది.
ఆగస్టు 30 న అమెరికా దళాలు తమ బలగాలను ఆఫ్ఘనిస్థాన్ నుండి ఉపసంహరించుకున్న తరువాత తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి అరాచక పాలన సాగిస్తుంది. ఇక భారత్ తన పౌరులను తరలించడానికి చివరిసారిగా ఆగస్టు 21 న కాబూల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని నడిపింది. ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న భారతీయుల భద్రతపై అప్పుడు ఎంతో ఆందోళన చెందింది.