Begin typing your search above and press return to search.

అడవి జంతువుల్లో తొలి పాజిటివ్ కేసు నమోదు

By:  Tupaki Desk   |   16 Dec 2020 11:30 PM GMT
అడవి జంతువుల్లో తొలి పాజిటివ్ కేసు నమోదు
X
కరోనా ..కరోనా .. కరోనా .. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం రేగుతూనే ఉంది. చైనా లో మొదలై, ఆ తర్వాత ఒక్కొక్క దేశానికి పాకి, మొత్తం ప్రపంచాన్ని స్తంభింపజేసింది. ఒకానొక సమయంలో కరోనా జోరుకి ఒక దేశానికీ మరో దేశానికీ అసలు సంబంధాలే తెగిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా ఆగిపోయింది. ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. అయితే , ఆ తర్వాత ప్రజల కోసం లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చినా కూడా, కరోనా కేసులు మాత్రం నమోదు అవుతూనే ఉన్నాయి. అలాగే ఈ మహమ్మారి భారిన పడి ఇప్పటికే చాలామంది మరణించారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి విజృంభించిన ఈ మహమ్మారి మనుషులతో దారుణంగా ఆడుకుంటోంది.

తాజాగా జంతువులకు సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మొదటి సారిగా కరోనా వైరస్ ఓ అడవిజంతువుకు సోకింది. యూరప్, అమెరికాలో ఎక్కువగా కనిపించే మింక్ అనే జంతువుకు కరోనా సోకినట్లు అమెరికా వ్యవసాయ శాఖ గుర్తించింది. అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఇదే తొలి సార్స్-కోవ్ 2 కేసు. అమెరికా, ఐరోపా ఫార్మ్‌లలో ఇప్పటికే కరోనా వైరస్ ప్రబలడంతో లక్షాలాది మింక్ ‌లను చంపి పాతిపెట్టారు. గతంలో కొన్ని జూ జంతువుల్లో కూడా కరోనా లక్షణాలు బయటపడ్డ విషయం అందరికి తెలిసిందే. కాగా ఇప్పటికే కరోనాను నిరోధించడానికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం కసరత్తు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు వ్యాక్సిన్ రెడీ చేసి టీకాల రూపంలో ప్రజలకు అందిస్తోంది. వ్యాక్సిన్ రావడంతో ఇప్పడిప్పడే ఊపిరి పీల్చుకుంటున్న జనానికి మళ్లీ జంతువుల్లో కరోనా గుబులు పుట్టిస్తోంది.