Begin typing your search above and press return to search.

ఏపీలో మొట్టమొదటి పైలెట్‌ ట్రైనింగ్ సెంటర్ .. ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   9 Oct 2020 9:00 AM GMT
ఏపీలో మొట్టమొదటి పైలెట్‌ ట్రైనింగ్ సెంటర్ .. ఎక్కడంటే ?
X
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది. హైదరాబాద్, బెంగుళూరు ఎయిర్ పోర్టులకు సమీపంలో ఉన్న కర్నూలు ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మరోవైపు కర్నూలు ఎయిర్ పోర్టును విజయదశమి సమయానికి అందుబాటులో తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ ఒక్కొక్కటీ సమకూర్చుకుంటోంది.

ఇందులో భాగంగా తొలి పైలట్ శిక్షణా కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటు హైదరాబాద్, అటు బెంగుళూరు ఎయిర్ పోర్టులకు సమీపంలో ఉండటం , త్వరలో కర్నూలు ఎయిర్‌ పోర్ట్‌ అందుబాటులోకి రానుండటంతో ఇక్కడ పైలెట్‌ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ వి.ఎన్‌.భరత్‌ రెడ్డి తెలిపారు. లట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం మూడు సంస్థలు ముందుకు రావడంతో..ఫైనాన్షియల్ బిడ్లు పిలవనుంది ప్రభుత్వం.

ఈ శిక్షణా కేంద్రానికి సంబంధించిన మౌళిక సదుపాయాల్ని ఆ సంస్థే సమకూర్చుకోవల్సి ఉంటుందని..కర్నూలు ఎయిర్ పోర్టు ల్యాండ్ ఉపయోగించుకున్నందుకు ఎయిర్ పోర్టు కార్పొరేషన్ కు అద్దె చెల్లించాల్సి ఉంటుందని కార్పొరేషన్ తెలిపింది.కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతులు రాగానే కర్నూలు ఎయిర్ ‌పోర్టు ను విజయదశమికి అందుబాటులోకి తీసుకువస్తామని కార్పొరేషన్ వెల్లడించింది.

ఉడాన్ పథకం కింద కర్నూలు నుంచి చౌకగా విమాన సర్వీసులు నడపడానికి ట్రూజెట్‌ సంస్థ మూడు రూట్లు దక్కించుకుంది. కర్నూలు నుంచి విజయవాడ, విశాఖ, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది. ఇప్పటికి పగటి పూట మాత్రమే విమానాలు నడుపుతారు. రెండవ దశలో రాత్రి వేళ కూడా సర్వీసులు ప్రారంభిస్తారు. ఇకపోతే , దాదాపు 970 ఎకరాల్లో 160 కోట్లతో ఏపీఏడీసీఎల్‌ కర్నూలు ఎయిర్‌పోర్టును నిర్మించింది. 2 వేల మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రన్‌వేను అభివృద్ధి చేశారు.