Begin typing your search above and press return to search.

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. ఆ రాష్ట్రంలోనేనా?

By:  Tupaki Desk   |   27 Dec 2020 8:00 AM GMT
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. ఆ రాష్ట్రంలోనేనా?
X
అత్యున్న స్థానాల్లో ఉన్న వారికి సైతం ‘సొంత ప్రాంతం’పై ఉండే అభిమానం అంతా ఇంతా కాదు. ఆ విషయంలో వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఉంటుదన్న విషయం మరోసారి నిరూపితమవుతోంది. దేశానికి ప్రధానమంత్రి అయిన మోడీ.. తన సొంత రాష్ట్రానికే తొలి బుల్లెట్ ట్రైన్ ను తీసుకొచ్చే తీరు చూస్తే.. కాసింత ఆశ్చర్యం కలుగక మానదు. మోడీ కలల ప్రాజెక్టుగా చెప్పే బుల్లెట్ ట్రైన్ ను దశల వారీగా పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. తొలిదశలో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు గుజరాత్ కే పరిమితం కానుంది. ఆ రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనున్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నుంచి వాపీ వరకు తొలి బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనున్నట్లుగా చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం325 కిలో మీటర్లు. ఈ రెండు ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన కొత్త ట్రాక్ మీద.. బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది.

రెండో దశలో గుజరాత్ - మహారాష్ట్ర మధ్యన పరుగులు తీయనుంది. 2024 నాటికి పూర్తి అయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించి గుజరాత్లో 80 శాతానికి పైగా భూసేకరణ పూర్తి అయ్యింది. అయితే.. మహారాష్ట్రంలో మాత్రం భూసేకరణ ఆలస్యమవుతోంది. ఈ కారణంతో ప్రాజెక్టు కాస్త లేట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏమైనా.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనే పరుగులు తీసే అవకాశం ఉండటం గమనార్హం.