Begin typing your search above and press return to search.
హ్యాపీ న్యూస్: ఇండోనేషియా ఓపెన్ ను సొంతం చేసుకున్న తొలి భారత జంట
By: Tupaki Desk | 18 Jun 2023 10:49 PM GMTభారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ సత్తాను చాటారు. ఇప్పటికే పలు టైటిళ్లను సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల గురించి తెలిసిందే. తాజాగా బారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయి రాజ్ - చిరాగ్ శెట్టిల జంట అద్భుత ప్రదర్శన చేయటంతో చరిత్రలో తొలిసారి ఇండోనేషియా డబుల్స్ టైటిల్ ను సొంతం చేసుకోవటం సాధ్యమైంది.
మలేషియా జోడీతో జరిగిన ఇండోనేషియా ఓపెన్ ఫైనల్ లో ఆరోన్ చియా.. సో వుయిక్ పైన సాత్విక్ - చిరాగ్ జంట అద్భుత ప్రదర్శన చేశారు. వరుస రెండు సెట్లను 21-17, 21-18 తేడాతో నెగ్గి తమ సత్తా చాటారు. కోట్లాది మంది భారతీయుల్ని ఆనందానికి గురి చేసింది ఈ క్రీడాకారుల అద్భుత ప్రదర్శన. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇండోనేషియా ఓపెన్ టైటిల్ ను గెలుచుకోవటం ద్వారా ఈ క్రీడాకారుల క్రీడా జీవితాల్లో ఇదే తొలి సూపర్ 1000 టైటిల్ కావటం గమనార్హం.
పోటాపోటీగా సాగిన ఫైనల్ పోరుతో విజయం కోసం భారత్ - మలేషియా క్రీడాకారులు పోటాపోటీ ప్రదర్శన చేశారు. తీవ్రంగా పోరాడారు. ఏ మాత్రం ఒత్తిడికి లొంగని భారత జంట ఫైనల్ పోరులో విజయాన్ని సాధించి.. టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ జంట ఖాతాలో ప్రపంచ ఛాంపియన్ షిప్.. థామస్ కప్.. కామన్వెల్త్ గేమ్స్ మెడల్స్ ఉన్నాయి. ప్రస్తుత డబుల్స్ ర్యాకింగ్స్ లో సాత్విక్ - చిరాగ్ జోడీ ఆరో స్థానంలో ఉన్నారు. వీకెండ్ వేళ.. వీరు సాధించిన అద్భుత విజయం కోట్లాది మంది భారతీయుల్ని ఆనందానికి గురి చేసిందని చెప్పక తప్పదు.