Begin typing your search above and press return to search.

చరిత్ర లో తొలిసారి.. అలాంటి పాస్ పోర్టు జారీ చేసిన అమెరికా

By:  Tupaki Desk   |   28 Oct 2021 4:59 AM GMT
చరిత్ర లో తొలిసారి.. అలాంటి పాస్ పోర్టు జారీ చేసిన అమెరికా
X
చారిత్ర క అడుగు పడింది. ప్రపంచం లో ఆడ.. మగ మాత్రమే గుర్తింపు ఉండేది కొద్ది కాలం క్రితం వరకు. మారిన కాలాని కి తగ్గట్లు.. కొన్ని కొత్త పోకడల్నిగుర్తించాల్సిన అవసరం రావటం.. అందు లో భాగం గా ఆడ.. మగ కాని వారిని గుర్తించే ప్రక్రియ మొదలైంది. వారిని ఎల్ జీబీటీ మరింత సింఫుల్ గా.. అందరికి అర్థమయ్యే లా చెప్పాలంటే లెస్బియన్.. గే.. బైసెక్సువల్.. ట్రాన్స్ జెండర్లు గా గుర్తించటం షురూ అయ్యింది.

ఇదం తా ఒక ఎత్తు అయితే.. ఎలా అయితే మగ.. ఆడను వేర్వేరు గా గుర్తిస్తారో.. అలానే తమ ను కూడా గుర్తించి.. తమ కు వేరే పాస్ పోర్టు జారీ చేయాలన్న డిమాండ్ గడిచిన కొద్దికాలం గా వినిపిస్తోంది. అయితే.. దీని పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే.. తాజా గా ఇలాంటి వారిని గుర్తించే పని లో భాగం గా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరి కా ప్రభుత్వం తాజాగా ‘‘ఎక్స్’’ జెండర్ హోదా కలిగిన ఒక కొత్త తరహా పాస్ పోర్టు ను జారీ చేసింది.

ఇదో పెద్ద విజయం గా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇదో పండుగ లాంటి వార్త అని.. ఎల్ జీబీటీ హక్కుల కార్యకర్తు జెస్సికా స్టెర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత కూ ఈ చారిత్రక పాస్ పోర్టు ను ఎవరికి జారీ చేశారన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. గోప్యం గా ఉంచాలని భావించినట్లు గా చెబుతున్నారు. ఈ తరహా పాస్ పోర్టు కోసం కొలరాడో కు చెందిన డానా జిమ్ అనే వ్యక్తి 2015 నుంచి పోరాడుతున్నాడు. అబ్బాయి గా పుట్టిన డానా జిమ్ కొంత కాలం అమెరికా సైన్యం లో కూడా పని చేశాడు.

అనంతరం లింగ మార్పిడి చేసుకొని అమ్మాయి గా మారిపోయాడు. అప్పటి నుంచి తన లాంటి వారి హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఈ క్రమం లో అమెరికా జారీ చేసిన తొలి ఎక్స్ పాస్ పోర్టు డానా జిమ్ కే ఇచ్చి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారికంగా మాత్రం ఎవరూ దీన్ని ఖరారు చేయటం లేదు.