Begin typing your search above and press return to search.

మెదడు తినేస్తున్న అమీబా.. కొరియాలో తొలి మరణం.. అప్రమత్తమైన భారత్..!

By:  Tupaki Desk   |   28 Dec 2022 3:30 AM GMT
మెదడు తినేస్తున్న అమీబా.. కొరియాలో తొలి మరణం.. అప్రమత్తమైన భారత్..!
X
మనిషి మెడదులోకి అమీబా చేరి క్రమంగా తినేస్తూ ప్రాణాలను వైరస్ హరిస్తుండటం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. 1937లో అమెరికాలో తొలిసారి మనిషి మెదడు తినే అమీబా కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు దక్షిణ కొరియాలో ఒక కేసు బయటపడింది. ఈ నేపథ్యంలోనే భారత్ సహా అన్ని దేశాలు ఈ విషయంలో అలర్ట్ అవుతున్నాయి.

థాయ్ లాండ్ కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి దక్షిణ కొరియాలో అమీబా కారణంగా మృత్యువాత పడటంతో అసలు విషయం బయటికి వచ్చింది. నెగ్లేరియా ఫౌలేరీగా పేర్కొనే అమీబా మనిషి మెదడులో చేరి క్రమంగా తినేస్తుందని గుర్తించారు. తద్వారా మనిషులు మృత్యువాతకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియాలో మెదడు తినే అమీబా కారణంగా తొలి మరణం నమోదైనట్లు స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు. అయితే ఇలాంటి కేసులు మరెక్కడైనా నమోదయ్యాయా? అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దక్షిణ కొరియాలో థాయలాండ్ చెందిన వ్యక్తి మాత్రమే నేగ్లేరియా ఫౌలెరీ లేదా మెదడు తినే అమీబా తొలి ఇన్ఫెక్షన్ సోకిందని పేర్కొన్నారు.

కాగా ఇటువంటి కేసులు 1937లో అమెరికాలోని టెక్సాస్ లో తొలిసారి వెలుగు చూశాయి. ఓ పదేళ్ల బాలిక స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు ఆమెకు ఈ మెదడు తినే అమీబా ఇన్ ఫెక్షన్లు సోకింది. ఆ తర్వాత ఈ ఇన్ఫెక్షన్ బాలిక మరణానికి కారణమైందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ వైరస్ గురించి సైంటిస్టులు పలు పరిశోధనలు చేపట్టారు.

నెగ్లేరియా ఫౌలెరీ లేదా మెదడు తినేసే అమీబా వెచ్చటి నీరు ఉండే సరస్సులు.. నదులు.. కాలువలు.. స్మిమ్మింగ్ పూల్స్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని గుర్తించారు. ఈ వైరస్ నీటిలో నుంచి ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశించి క్రమంగా తినేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.

అయితే ఈ వైరస్ అంటు వ్యాధి కాదని తేలడంతో ప్రజలంతా ఊపిరి పీల్చు కుంటున్నారు..2018 వరకు భారత్.. అమెరికా.. థాయిలాండ్ సహా ప్రపంచ దేశాల్లో ఇలాంటి కేసులు 381 నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో మరోసారి ఇలాంటి కేసు వెలుగుచూడటంతో అన్ని దేశాలు అప్రమత్త మవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.