Begin typing your search above and press return to search.

ఓ వైపు ఎగ్జిట్‌పోల్స్‌...ఇంకో వైపు కాల్పులు

By:  Tupaki Desk   |   7 Nov 2020 5:45 PM GMT
ఓ వైపు ఎగ్జిట్‌పోల్స్‌...ఇంకో వైపు కాల్పులు
X
దేశంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల చూపు ఇప్పుడు బీహార్ వైపున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో వ‌చ్చే ఫ‌లితాల ఆధారంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప‌ట్ల ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంద‌నే విష‌యంలో ఓ అంచ‌నాకు రావొచ్చ‌ని ప‌లువురు భావిస్తున్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేటితో ముగిసింది. ఇందుకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ తాజాగా విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మహాగట్‌ బంధన్‌ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి)కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇదే స‌మ‌యంలో బీహార్‌లో కాల్పుల క‌ల‌క‌లం సంచ‌ల‌నంగా మారింది.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ ముగిసింది. అయితే, పోలింగ్ స‌మ‌యంలో పుర్నియా జిల్లాలోని దందహ అసెంబ్లీ నియోజకవర్గంలో గల సస్త్రీ ఏరియాలో ఫైరింగ్ జరిగింది. ఆగంతకులు కాల్పులు జరిపి.. పారిపోయారు. ఈ కాల్పుల్లో ఆర్జేడీ నేత బిట్టు సింగ్ సోదరుడు బేణి సింగ్‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిపారు. దీంతో బేణి సింగ్ అక్కడకక్కడే చనిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

ఇదిలాఉండ‌గా, బీహార్‌లోని మొత్తం 243 సీట్లకు జరిగిన మూడు విడతల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మెజార్టీ స‌ర్వేల్లో బీజేపీ ప్ర‌తిప‌క్ష కూట‌మికే పీఠం ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని తేల్చాయి. టైమ్స్‌ నౌ - సీ ఓటర్ స‌ర్వేలో ఆర్జేడీ కూటమికే మొగ్గు క‌నిపించింది. ఎన్డీఏ 116, మహాకూటమి 120, ఎల్జేపీ 1 సీట్లు ద‌క్కించుకుంటాయ‌ని తేల్చింది. పీపుల్స్ పల్స్- పీఎస్జీ సర్వేలో బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ వైపు 36 శాతం, నితీష్ కుమార్ వైపు 34 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు.