Begin typing your search above and press return to search.

ఛీ ..ఛీ .. కన్నకూతుళ్లపైనే మృగాడిగా మారిన తండ్రి !

By:  Tupaki Desk   |   1 Jan 2021 11:30 AM GMT
ఛీ ..ఛీ .. కన్నకూతుళ్లపైనే మృగాడిగా మారిన తండ్రి !
X
సమాజంలో ఎవరికైనా చెప్పినా అసలు నమ్మలేని దారుణ సంఘటన. కనీసం వినడానికి కూడా విస్తుపోయే ఘోరం. ఎవరూ ఊహించని అరాచకం. కలికాలమంటూ ముక్కున వేలేసుకోవాల్సిన సందర్భం ఇది. ఈ ఘటన హైదరాబాద్‌ శివారులో జరిగింది. కన్నతండ్రి అంటే పిల్లలకు భరోసా. అన్నీ తానై బాధ్యతలన్నీ నెరవేర్చాల్సిన స్థానం. తల్లి తర్వాత పిల్లలకు ఈ లోకంలో తండ్రే ప్రధానం. వాళ్లను పోషించడమే కాదు. వాళ్లమీద ఈగవాలకుండా చూసుకోవాల్సిన రక్షకుడు. కానీ, రాక్షుసుడిగా మారాడు.

అమ్మాయిలకు ఇంటి బయట కాదు. సాక్షాత్తూ ఇంట్లోనూ రక్షణ కరువవుతోందన్న దారుణానికి నిదర్శనంగా నిలిచిందీ ఘటన. హైదరాబాద్‌ లోని జీడిమెట్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమర్‌ నాథ్‌ కు 10, 8వ తరగతులు చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిపై కన్నేసిన ఆ కీచక తండ్రి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియో తీసి దానితో బ్లాక్‌ మెయిల్ చేస్తూ కీచక పర్వాన్ని కొనసాగించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూతుళ్లను బెదిరించాడు.

తండ్రి ఆగడాలు మరింత శ్రుతిమించడంతో ఆ ఇద్దరు బాలికలు బంధువులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో వారు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల నుంచి వాంగ్మూలం తీసుకున్న తీసుకున్న పోలీసులు అమర్‌నాథ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ఎల్బీనగర్‌లోని సైబరాబాద్‌ మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది.