Begin typing your search above and press return to search.
కూతురి ప్రేమ.. కూతురితో పాటు తల్లి బలి!
By: Tupaki Desk | 20 Aug 2020 11:30 PM GMTఈ మధ్య కాలంలో పరువు హత్యలు ఎక్కువ అవుతున్నాయి. కుమార్తెలు ప్రేమించింది అని తెలియగానే ఆ అమ్మాయి పై దాడికి దిగి హత్య చేస్తున్నారు. నేటి సమాజంలో ప్రేమించడం పరిపాటే .. కానీ , వారి ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దలు వారిని కడతేర్చడానికి కూడా వెనుకాడటం లేదు. అలాంటి ఘటనే మరొకటి జరిగింది. కూతురికి మంచి చదువు చెప్పించి .. భవిష్యత్‌లో మంచి ప్రయోజకురాలిగా చేయాలనుకున్నారు.. కానీ, ఆ అమ్మాయి ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమ వ్యవహారం ఆ ఇంట్లో ఇద్దరిని బలి తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మొగిలిగిద్ద గ్రామానికి చెందిన స్రవంతి అదే గ్రామానికి చెందిన రాందాసు అనే ఓ యువకుడి తో ప్రేమలో పడింది. ఈ విషయమై స్రవంతి, ఆమె తల్లి చంద్రకళ తరచూ గొడవపడుతుండేవారు. ప్రేమ విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో ఇటీవల గ్రామం నుంచి వెళ్లిపోయారు. పెద్దలు నచ్చచెప్పి వీరిని మళ్లీ గ్రామానికి తీసుకువచ్చారు. తర్వాత కూడా వీరిలో మార్పురాక పోవడం తో తల్లిదండ్రులు కుమార్తె ను పలుమార్లు హెచ్చరించారు ఈ నెల 15న తల్లీకూతురు మళ్లీ ఘర్షణ పడ్డారు. అదే సమయంలోనే చంద్రకళ భర్త పాండు ఇంటికి వచ్చీ రాగానే స్రవంతి పై కిరోసిన్ పోయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న చంద్రకళ పై కూడా కిరోసిన్ పడింది. ప్రేమ వ్యవహారం పై కోపం తో ఉన్న చంద్రకళ.. కూతురుకు నిప్పంటించగా తనకు కూడా మంట అంటుకుంది. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పాండుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు.