Begin typing your search above and press return to search.

రెండేళ్ల తరువాత మరణించిన కొడుకు గుండెచప్పుడు విన్న తండ్రి

By:  Tupaki Desk   |   17 Feb 2020 8:30 PM GMT
రెండేళ్ల తరువాత మరణించిన కొడుకు గుండెచప్పుడు విన్న తండ్రి
X
చనిపోయిన కొడుకు గుండె చెప్పుడు ., రెండేళ్ల తరువాత ఆ తండ్రి ఎలా విన్నాడు అని ఆలోచిస్తున్నారా?మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా! ఇది కూడా అలాంటిందే. చాలామంది చనిపోయిన తరువాత తమ అవయవాలని దానం చేసి ..నలుగురికి జీవితాన్ని ఇస్తుంటారు. ఈ కథ కుడా అలాంటిందే.

అదొక పెద్ద విషాద ఘటన ...జోర్డాన్ స్పాన్‌ అనే ఒక తండ్రి యాక్సిడెంట్‌లో చనిపోయిన తన కొడుకు గుండె చప్పుడు వేరొకరిలో వింటూ కన్నీరు పెట్టుకున్నాడు. కొన్ని నెలల క్రితం టెక్సాస్‌ లోని బ్రెన్హామ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాథ్యూ స్పాన్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అప్పటికే అతను అవయవదానానికి సంతకం చేసి ఉండడంతో అతని అవయవాలను తీసి మరో ఐదుగురికి అమర్చారు. ఆ క్రమంలోనే గుండెనొప్పితో బాధపడుతున్న క్రిస్టి రిచర్డ్ రస్ అనే మహిళకు మాథ్యూ స్పాన్ గుండె సరిపోతుందని గుర్తించి ఆమెకి డాక్టర్లు అమర్చారు.

ఆ సర్జరీ జరిగిన రెండేళ్ల తర్వాత జోర్డాన్.. అతని భార్య ఆ మహిళ ను కలిశారు. ఆమె ఛాతీ నుంచి హార్ట్ బీట్ వింటూ తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడని గుండె చప్పుడులో సజీవంగానే ఉన్నాడంటూ ఎమోషనల్ అయ్యాడు. జోర్డాన్ నేనూ కలిసి ఓ ప్రత్యేకమైన మహిళను కలిశాం. మాథ్యూ స్పాన్ అవయవదానం చేశాడని ఎంత మందికి తెలుసో నాకు తెలియదు. కానీ, 7అవయవాలను డొనేట్ చేసి అయిదుగురి ప్రాణాలు కాపాడాడు అంటూ కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు.

ఆ తండ్రి తన కొడుకు గుండె చప్పుడు వింటూ ఎమోషనల్ అయిన వీడియో ను సోషల్ మీడియా లోనూ పోస్టు చేశారు. ఆ వీడియోతో అయన పలువురు నెటిజన్ల మనసు దోచుకుంటున్నాడు. 'మీకు తెలుసా నా కొడుకు గుండె చప్పుడ్ని పది రోజుల పాటు వింటూనే ఉన్నా. చావు బతుకుల మధ్య పోరాడుతున్న సమయంలో హాస్పిటల్‌ మానిటర్‌ పై చూస్తూ ఉండేవాణ్ని' అంటూ చెప్పుకొచ్చాడు. మరొకరికి ప్రాణదానం చేయడమనేది ఉన్నతమైన విషయం. ఇప్పటికే మీరు ఆర్గాన్ డొనార్ కాకపోయుంటే వెంటనే రిజిష్టర్ చేయించుకుని వేరొకరికి ప్రాణదానం చేసిన వాళ్లవుతారని గుండెను దానంగా పొందిన మహిళ తెలిపారు.