Begin typing your search above and press return to search.

దర్భాంగ రైల్వేస్టేషన్ విస్పోటనం నిందితుల తండ్రి మాజీ సైనికుడు

By:  Tupaki Desk   |   3 July 2021 6:30 AM GMT
దర్భాంగ రైల్వేస్టేషన్ విస్పోటనం నిందితుల తండ్రి మాజీ సైనికుడు
X
దర్భంగ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న విస్పోటనం పెనుసంచలనంగా మారింది. దీనికి కారణమైన వారిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగటం.. చివరకు హైదరాబాద్ లోవస్త్ర వ్యాపారం చేసే ఇద్దరు సోదరుల (నాసిర్.. ఇమ్రాన్)ను అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. అక్కడెక్కడో దర్భంగలో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కీలక కుట్ర.. హైదరాబాద్ లో ప్లానింగ్ జరగటం హాట్ టాపిక్ గా సాగింది. దేశంలో ఎక్కడు ఉగ్రవాద చర్యలు చేపట్టినా.. దానికి సంబంధించిన ఏదో ఒక లింకు హైదరాబాద్ లో ముడిపడి ఉండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

దర్భంగ ద్రోహంలో నిందితులుగా పట్టుబడిన నాసిర్.. ఇమ్రాన్ లకు సంబంధించిన కొత్త కోణం ఒకటి బయటకు వచ్చింది. వీరిద్దరూ తమ పాడు బుద్దితో దేశానికి ద్రోహం చేసేందుకు ప్రయత్నిస్తే.. అందుకు భిన్నంగా వీరిద్దరి తండ్రి మాజీ సైనికుడు కావటం విశేషం. అంతేకాదు.. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధ వేళ ఎంతో సాహసాన్ని ప్రదర్శించిన ఆయన..యుద్ధం తర్వాత రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వంట సామాగ్రి అమ్మే వ్యాపారం చేస్తున్న ఆయన.. తన కొడుకులు చేసిన పని గురించి తెలిసి.. వ్యాపారాన్ని మూసివేసి కనిపించకుండా వెళ్లిపోయారు. ఇంటికి కూడా తాళం వేసి ఉందని చెబుతున్నారు.

రెండు నెలల క్రితం వరకు ఇమ్రాన్ తన తండ్రి షాపులోనే ఉండేవాడు. కొంతకాలం క్రితం పాక్ లోని ఉండే ఇక్బాల్ లో పరియం కావటం.. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఇతడు భారత ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. ఇక్బాల్ ఆదేశాల మేరకు బంధువుల్ని కలిసేందుకు పాక్ వెళుతున్నట్లుగా చెప్పి 2012లోవీసా తీసుకొని దాయాది దేశానికి వెళ్లాడు. అక్కడ ఉగ్రవాద క్యాంప్ లో నాలుగు నెలల పాటు ఉగ్రశిక్షణ పొందినట్లుగా తెలుస్తోంది. తండ్రి దేశ భక్తుడైతే.. కొడుకులు ఇలా దేశ ద్రోహులుగా ఉండటం షాకింగ్ గా మారింది.