Begin typing your search above and press return to search.

దేశంలో వేగంగా పెరుగుతున్న బిలియనీర్లు

By:  Tupaki Desk   |   17 May 2021 12:30 AM GMT
దేశంలో వేగంగా పెరుగుతున్న బిలియనీర్లు
X
దేశంలో సామాన్యుడు, పేదవాడు కాసులు దొరక్క అష్టకష్టాలు పడుతుంటే పారిశ్రామికవేత్తలు మాత్రం తమ సంపదను రోజురోజుకు పెంచుకుంటూనే ఉంటున్నారు. 75 ఏళ్ల భారతదేశంలో పేదవాళ్ల తలరాత మారకున్నా.. ప్రభుత్వాలు.. వారి విధానాల వల్ల కొందరు పారిశ్రామికవేత్తలు మాత్రం బిలియనీర్లుగా మారిపోతున్నారు.

భారత్ లో పారిశ్రామికవేత్తలైన కొంతమంది ఇప్పుడు బిలియనీర్లుగా మారిపోతున్నారు. 7వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన వారి సంఖ్య మాత్రం ప్రతిఏటా గణనీయంగా పెరుగుతోంది.

దేశంలో అగ్రగామి 15 రంగాలకు చెందిన ఉమ్మడి సంపద గత ఐదు సంవత్సరాలలో ఏకంగా 60శాతం పెరిగింది. ఈ మేరకు హురున్ ఇండియా సంస్థ తన నివేదికను తాజాగా విడుదల చేసింది. 2020 డిసెంబర్ ఆఖరు నాటికి ఈ 15 రంగాలకు చెందిన బిలియనీర్ల సంపద 37.39 లక్షల కోట్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది.

2016లో ఈ 15 పరిశ్రమల్లోని ఉమ్మడి సంపాదన విలువ 23.26 లక్షల కోట్లుగా ఉంది. నాలుగేళ్లలోనే గణనీయంగా పెరిగి 37.39 లక్షల కోట్లకు వారి ఉమ్మడి సంపద విలువ ఎగబాకింది. 2016లో 269మంది బిలియనీర్లు ఉంటే 2020 నాటికి వీరి సంఖ్య 613కు పెరగడం విశేషం. అంటే అయిదేళ్లలో దేశంలో బిలియనీర్ల సంఖ్య 3 రెట్లు పెరిగిందన్నమాట.. ముఖ్యంగా ఫార్మా రంగ ప్రముఖులు అత్యధిక సంపదతో ఈ జాబితాలో నిలిచారు. కరోనా సమయంలో ఫార్మారంగం మాత్రమే పనిచేసింది. భారీగా లాభాలు పొందింది.

ఆ తర్వాత కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ రంగానికి చెందిన 55 మంది బిలీయనీర్లు ఉన్నారు. వీరి ఆస్తుల విలువ 3.43 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ రంగ బిలియనీర్లు ఉన్నారు. టెక్నాలజీ రంగం కూడా అత్యధిక మిలియనీర్లతో ఉమ్మడి సంపద విలువ భారీగా పెంచుకుంటోంది.

దేశంలోని వివిధ నగరాలను పరిశీలిస్తే ముంబై అత్యధిక బిలియనీర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బెంగళూరు67 మంది బిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానం హైదరాబాద్ నగరానిదే.. అహ్మదాబాద్ ఐదో స్థానంలో నిలిచింది.