Begin typing your search above and press return to search.
లండన్ కి చేరిన రైతు ఉద్యమం ... భారత హైకమిషన్ కార్యాలయం ముట్టడి !
By: Tupaki Desk | 7 Dec 2020 4:47 AM GMTకేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగుతోంది. ఈ చట్టాలను అడ్డుపెట్టుకుని కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంపై గుత్తాధిపత్యం సాధిస్తాయని, అప్పుడు తాము దోపిడికి గురవుతామని రైతుల భయంతో ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేస్తున్నాయి. ఈ రైతుల ఆందోళనకి విదేశాల్లో కూడా మద్దతు పెరుగుతోంది. రైతాంగ నిరసనల ఉద్యమం లండన్ వరకూ పాకింది. ఇప్పటికే కెనడా తన గళాన్ని వినిపించింది.
ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో స్వయంగా.. రైతన్నలకు అండగా నిలిచారు. ఈ సారి బ్రిటన్ లో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు నిరసన బాట చేపట్టారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వేలాదిమంది నిరసన చేపట్టారు. భారత హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే, కరోనా నియమాలు అమలులో ఉండటంతో లండన్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా లండన్‌లోని సిక్కులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. వేలాదిమంది రోడ్ల మీదికి వచ్చారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. పంజాబ్ రైతులకు తాము మద్దతు ఇస్తున్నామంటూ నినదించారు.
కార్లు, బైకులు, ఇతర వాహనాల ద్వారా వారంతా నిరసన ప్రదర్శనలను చేపట్టారు. లండన్ లోని ఆల్డ్ విచ్ ప్రాంతంలో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయానికి ర్యాలీగా తరలి వెళ్లారు. ఇండియన్ ఓవర్ సీస్ కాంగ్రెస్ ఈ నిరసన ప్రదర్శనలకు సారథ్యాన్ని వహించింది. అనంతరం భారత హైకమిషన్ కార్యాలయం వద్ద బైఠాయించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లండన్ సహా బ్రిటన్ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం మాస్కులు, ధరించడం భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి. నిరసన ప్రదర్శనలపై నిషేధం విధించారు. కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా లండన్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.