Begin typing your search above and press return to search.

నాలుగు రోజుల్లో. ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌ మారేది చేరేదీ ఎంత‌మందంటే!!

By:  Tupaki Desk   |   28 March 2023 3:16 PM GMT
నాలుగు రోజుల్లో. ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌ మారేది చేరేదీ  ఎంత‌మందంటే!!
X
ఏపీలో సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రోసారి మంత్రి వ‌ర్గవిస్త‌ర‌ణ‌కు రెడీ అయిందా? దీనికి ముహూర్తం కూడా ఖ‌రారు చేశారా? అంటే. ఔన‌నే అంటున్నాయి తాడేప‌ల్లి వ‌ర్గాలు. తాజాగా గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌ను సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా క‌లిసి వ‌చ్చారు. నిజానికి ఇప్ప‌టికిప్పుడు గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వాల్సిన అవ‌స‌రం కానీ, ఆయనతో చ‌ర్చించాల్సిన అంశాలు కానీ. లేవు. అయినప్ప‌టికీ.. జ‌గ‌న్ ఎందుకు క‌లిశార‌నేది ఆస‌క్తి గా మారింది. దీనిని బ‌ట్టి. సీఎం జ‌గ‌న్ మ‌రోసారి మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించే ప‌నిలోఉన్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

నిజానికి ఈ నాలుగేళ్లో ఒక‌సారి మంత్రి వ‌ర్గాన్ని మార్చారు. 2019లో ఏర్పాటు చేసిన మంత్రివ‌ర్గాన్ని రెండున్నరేళ్ల‌లో మారుస్తాన‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్‌. అనుకున్న విధంగాగ‌త ఏడాది ఏప్రిల్ 11న మంత్రి వ‌ర్గాన్ని మార్పు చేశారు. ఇక‌, ఏడాది కూడా గ‌డ‌వ‌క‌ముందే.. మ‌రోసారి మార్పున‌కు శ్రీకారం చుట్ట‌డానికి కార‌ణం. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ప్ర‌బ‌లుతోంద‌ని.. మంత్రులు స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని ఆయ‌న‌కు స్వ‌యంగా నివేది క‌లు అంద‌డ‌మేన‌ని స‌మాచారం.

పైగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మూడు స్థానాల్లోనూ వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇది కూడా వైసీపీ అధిష్టానం పై ఒత్తిడి ప‌డేలా చేసింది. ఈ కార‌ణంగా కూడా. మార్పు త‌థ్య‌మ‌ని తెలుస్తోంది. అయితే.. ఆది నుంచి ఇద్ద‌రు ముగ్గురు మంత్రుల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని అనుకున్నారు. వీరిలో అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గుమ్మ‌నూరు జ‌య‌రాం, ఉష‌ శ్రీచ‌ర‌ణ్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన పినిపే విశ్వ‌రూప్ పేరు కూడా వినిపించింది.

అయితే.. ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను మారుస్తార‌ని అంటున్నారు. అదేవిధంగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు కూడా ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఇక‌, వీరి స్థానంలో పాత మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిల‌ కు అవ‌కాశం ఇవ్వొచ్చ‌నే వాద‌న బ‌లం గా వినిపిస్తోంది. వీరు గ‌తంలో కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. అప్ప‌ట్లో బ‌ల‌మైన గ‌ళం వినిపించారు.

ఇప్పుడు మంత్రులు ఎవ‌రూ కూడా ప్ర‌భుత్వానికి అనుకూలంగా మాట్లాడ‌డం లేదు. దీంతో మార్పులు ఖాయ‌మ‌ని. వీరికి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని.. వీరితో పాటు.. కాపుల కోటాలో తోట త్రిమూర్తులు, క‌మ్మ కోటాలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ల‌కు ప్రాధాన్యం ఇస్తార‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే. మ‌రో మంత్ర విడ‌ద‌ల ర‌జ‌నీని ప‌క్క‌న పెట్టాల్సి వ‌స్తుంది. మ‌రి ఏంచేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.