Begin typing your search above and press return to search.
తండ్రి కట్టిన కోట.. చేజారిన వేళ.. 'మహా' రాజకీయాల్లో ముగిసిన శకం!!
By: Tupaki Desk | 23 Feb 2023 1:22 PM GMTఒక్కొక్క పుల్లా పేర్చి.. కట్టిన గూడు.. గాలివానకు కొట్టుకు పోయిన చందంగా.. మహారాష్ట్రలో శివసేన.. విల్లు బాణం.. అలానే కొట్టుకుపోయాయి. కేవలం హిందూత్వ అజెండాను నమ్ముకున్న పార్టీగా బీజేపీ ఆర్ ఎస్ ఎస్ కరకమలాల నుంచి ఉద్భవిస్తే.. శివసేన అలా రాలేదు. బాల ఠాక్రే ఉద్దేశం.. వేరు. శివసేన ఏర్పాటు లక్ష్యం వేరు. మరాఠా మూలాలకు.. గుజరాతీలు, రాజస్థానీయుల నుంచి వస్తున్న ఎదురు దెబ్బల నుంచి కాపు కాసేందుకు నడుం బిగించిన బాల ఠాక్రే.. చిత్రకారుడు.
వ్యంగ్య చిత్రకారుడు(కార్టూనిస్టు). మరాఠా ప్రజలంటే ఆయనకు అమితమైన అభిమానం. మరాఠా ప్రజల పరిరక్షణ, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను కాచి కాపాడుకునే లక్ష్యంతో శివసేన అనే సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత.. ఇదే రూపాంతరం చెంది పార్టీగా అవతరించింది. బాలఠాక్రే ఏనాడూ.. అధికారంలోకి రావాలని కానీ.. పాలించాలని కానీ కలలు గనలేదు. కేవలం అధికారంలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడం ద్వారా మరాఠా సంస్కృతిని కాపాడాలనే సిద్ధాంతంతోనే ముందుకు సాగారు.
ఈ క్రమంలో ఏర్పాటైన శివసేన.. మహారాష్ట్ర సరిహద్దులు దాటలేకపోయింది. కానీ, బీజేపీ అలా కాదు.. హిందూత్వ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తం.. కుదిరితే.. విశ్వవ్యాప్తం(ఇప్పుడు మోడీపై అంతర్జాతీయంగా వస్తున్న విమర్శ) చేయాలనే ప్రగాఢ లక్ష్యంతో ఏర్పాటైంది. అందుకే.. నెమ్మదిగా.. మహారాష్ట్రలో శివసేనను మచ్చిక చేసుకుంది. కలిసి పోటీ చేసింది. ప్రభుత్వాన్ని పంచుకుంది. అయితే.. బీజేపీ సిద్ధాంతంలో కీలకమైన భావన.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు!!
ఈ వాదాన్ని అర్ధం చేసుకోలేక పోయిన బాల ఠాక్రే.. కుమారుడు ఉద్దవ్ ఠాక్రే.. బీజేపీతో కయ్యం పెట్టుకున్నారు. కేవలం సీఎం పోస్టు కోసం.. ఆ పార్టీతో విభేదించారు. ఇలాంటి విభేదాలు వస్తాయనే గతంలో బాల ఠాక్రే అధికారానికి దూరంగా ఉన్నారు. అయితే.. ప్రచ్ఛన్న ప్రభుత్వాన్ని ఆయన సమాంతరంగా నడిపి చూపించారు. ఈ వ్యూహాన్ని ఉద్ధవ్ అందిపుచ్చుకోలేక పోయారు. గవర్నర్ విసిరిన వలకు చిక్కుకున్నారు. రాజకీయంగా తండ్రికి సమానమైన వ్యూహాలు వేయలేక పోయారు. ఉన్న కోటరీని కాపాడుకోలేక పోయారు.
బీజేపీ హిందూత్వ అజెండాకు తమకు తేడా లేదని..చెప్పడం ఉద్దవ్ చేసిన పెద్ద తప్పుగా ఇప్పటికీ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ హిందూత్వకు.. శివసేన మరాఠా తత్వానికి మధ్య చాలా సున్నితమైన వ్యత్యాసం ఉంది. ఇదే శివసేనకు ఇన్నాళ్లు వెన్నుదన్నుగా నిలిచింది. దీనిని చెరిపేయడమే పెద్ద పొరపాటని.. అంటున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ అనుంగుగా ముద్ర పడిన.. ఏక్‌నాథ్ షిండేకు పార్టీ దఖలు పడింది. ఇది.. ఎన్నాళ్లో పరిస్థితి లేదు.
ఏదో ఒకనాడు.. బీజేపీ తనలో జీర్ణం చేసుకోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఇప్పుడు ఉద్ధవ్‌కు కావాల్సింది.. ఏంటి.. తనేంటో నిరూపించుకునే వ్యూహంతో ముందుకు సాగడం.. తన తండ్రి ఆశయాల మేరకు ప్రజలను తనవైపు తిప్పుకోవాల్సి రావడం!! మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.