Begin typing your search above and press return to search.

ముగిసిన ;బోయింగ్747; శకం.. ;క్వీన్;కు ఘనంగా వీడ్కోలు..!

By:  Tupaki Desk   |   9 Dec 2022 8:30 AM GMT
ముగిసిన ;బోయింగ్747; శకం.. ;క్వీన్;కు ఘనంగా వీడ్కోలు..!
X
అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ 'జట్ జంబో' పేరిట వెడల్పు ఎక్కువ కలిగిన జెట్ విమానాల తయారీ చేపట్టింది. 1960 కాలంలో జంబో విమానాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో బోయింగ్ కంపెనీ వాషింగ్టన్ లోని తన కర్మాగారంలో బోయింగ్ 747 తయారీకి శ్రీకారం చుట్టింది. మొట్టమొదటి జంబో తయారీని 1969 ఫిబ్రవరి 9న ప్రారంభమైంది.

1970 నుంచి పాన్ అమెరికా వాయుమార్గం నుంచి ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ పొందింది. నాటి నుంచి అర శతాబ్ద కాలం పాటు జట్ జంబోలను బోయింగ్ తయారు చేసింది. అయితే ఇంధన సమర్థవంతమైన విమానాల కోసం ఎయిర్ లైన్స్ నుంచి ఒత్తిడి కారణంగా కొద్దిరోజులుగా నుంచి బోయింగ్ తన 747 విమానాల తయారీకి ముగింపు పలికేందుకు నిర్ణయించుకుంది.

ఇక కరోనా సమయంలో 747 బోయింగ్ తన యునైటెడ్.. డెల్టా మోడల్స్ బోయింగ్‌లను ఉపయోగించడం మానేశాయి. ఈ సమయంలోనే క్వాంటాస్.. బ్రిటిష్ ఎయిర్‌వేస్ జంబో జెట్‌కు సైతం వీడ్కోలు పలికాయి. ఇక తాజాగా వాషింగ్టన్ లోని తమ కార్మాగారం నుంచి చిట్టచివరి బోయింగ్ 747ను ఆ కంపెనీ అట్లాస్ ఎయిర్ లైన్స్ అప్పగించింది.

దీంతో బోయింగ్ 747 విమానాల శకం ముగిసింది. ఈ విమానాన్ని డెలివరీ చేయడానికి ముందు విమానయాన ఔత్సాహికులు.. పారిశ్రామిక నిపుణులు బోయింగ్ 747 సేవలపై ప్రశంసలు కురిపించారు. సీఎన్బీసీ ప్రకారం.. 1574 వ బోయింగ్ 747 కార్గో క్యారియర్ చిట్ట చివరి బోయింగ్ గా పేర్కొంది. దీనిని అట్లాస్ ఎయిర్‌కి డెలివరీ చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ కార్గో క్యారియర్ బోయింగ్ 747 డెలివరీ కంటే ముందు టెస్ట్ పైలట్ బోయింగ్ నడిపి రంగులు వేయనున్నారు. ఈ చివరి బోయింగ్ 747 విమానం 2023 ప్రారంభానికి ముందే అట్లాస్ ఎయిర్‌కు డెలివరీ చేయడానిగాను తమ ఎవెరెట్ ఫ్యాక్టరీని విడిచిపెట్టింది. ఇందుకు సంబంధించి బోయింగ్.. గ్రీన్ ప్రొటెక్టివ్ కోటింగ్‌తో కప్పబడిన విమాన చిత్రాలు ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ బోయింగ్ విమానాలపై సోషల్ మీడియాలో స్పందించారు. బోయింగ్ 747 ఎప్పటికైనా అత్యుత్తమ విమానాలలో ఒకటని మాస్క్ పేర్కొన్నాడు. అలాగే జెట్ ఎయిర్‌వేస్ సీఈవో సంజీవ్ కపూర్ 54 ఏళ్ళ క్రితం నాటి మొదటి బోయింగ్ 747 రోల్‌అవుట్ త్రోబ్యాక్ చిత్రంతో పాటుగా చివరి జంబో విమానాన్ని జత చేస్తూ ట్వీట్ చేశారు.

"దివంగత రాణి వలే.. ఈ రాణి మంచి సమయాలు.. చెడుల ద్వారా దీర్ఘాయువు.. గంభీరతను నిర్వచించిందని" సంజీవ్ కపూర్ తన ట్విటర్లో రాసుకొచ్చారు. ఇదిలా బోయింగ్ 747 విమానాలు ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య విమానంగా రికార్డు నెలకొల్పింది. వాణిజ్య.. కార్గో జెట్.. ఎయిర్స్ వన్ ప్రెసిడెన్షియల్.. ఎయిర్ క్రాప్ట్ గానూ సేవలందించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.