Begin typing your search above and press return to search.

అదే పనిగా భయాలు అక్కర్లేదు.. యుగాంతం లెక్క తేల్చారట

By:  Tupaki Desk   |   18 Aug 2020 11:30 PM GMT
అదే పనిగా భయాలు అక్కర్లేదు.. యుగాంతం లెక్క తేల్చారట
X
ఎవర్ గ్రీన్ సంతోషాలు.. అదే సమయంలో ఎవర్ గ్రీన్ భయాలు కొన్ని ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది యుగాంతం వ్యవహారం. ఉన్నట్లుండి.. యుగాంతానికి సంబంధించిన వార్తలు.. చర్చలు వస్తుంటాయి. కొద్దిరోజుల పాటు హాట్ హాట్ గా సాగే ఈ అంశం మీదా తాజాగా ఒక స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విశ్వసం ఎప్పటికి పూర్తిగా అంతమవుతుందన్న విషయాన్ని లెక్క తేల్చేందుకు శాస్త్రవేత్తలు ఒక ప్రయత్నం చేశారు.

తాజాగా వారు చేసిన అధ్యయాన్ని రిపోర్టు రూపంలోకి సిద్ధం చేశారు.రాయల్ అస్ట్రనామికల్ సొసైటీకి చెందిన జర్నల్ లో ఈ వివరాల్ని తాజాగా ప్రచురించారు దీని ప్రకారం.. ఇప్పట్లో భూమి అంతమయ్యే అవకాశం లేదని తేల్చారు. అంతేకాదు.. ఈ విశ్వం ఎప్పటికి అంతమవుతుందన్న విషయాన్ని లెక్క కట్టారు. భౌతిక సిద్ధాంత వేత్త మాట్ కాప్లాన్ అనే పెద్దాయన లెక్కల ప్రకారం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల వరకు విశ్వం భేషుగ్గా ఉంటుందని తేల్చారు.

యుగాంతం తర్వాత ఉండేది విషాదకరమైన.. ఒంటరైన.. అతి చల్లటి ప్రదేశంగా తేల్చారు. దాన్ని హీట్ డెత్ గా అభివర్ణించారు. విశ్వం అంతరించే సమయంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని వెల్లడించారు. విశ్వంలోని నక్షత్రాలు తరచూ పేలిపోతుంటాయని.. అలా పేలినప్పుడు బిగ్ బ్యాంగ్ చోటు చేసుకోదని.. టపాసులు పేలినట్లుగా భారీ నక్షత్రాలు పేలుతుంటాయని చెప్పారు. అంతా అయిపోయాక చనిపోయిన నక్షత్రాలు.. ఖాళీగా ఉండే బ్లాక్ హోల్స్ మాత్రమే మిగులుతాయని.. దీంతో..కాంతి కూడా ప్రయాణించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా చిమ్మ చీకటి మాత్రమే మిగులుతుందని తేల్చారు.

విశ్వం సంగతి ఓకే.. మరి భూమి మాటేమిటి? అంటే.. రాబోయే వెయ్యి సంవత్సరాల వరకు ఎలాంటి ఢోకా లేదని.. విపత్తులతో భూమి అంతరించే పరిస్థితి ఉండదని తేల్చారు. యుగాంతాన్ని నమ్మేవారు మాత్రం అంతా అయిపోతుందని చెబుతారు కానీ.. వాస్తవంలో మాత్రం అలాంటి పరిస్థితి ఇప్పట్లో రాదని చెబుతున్నారు. అనవసరమైన భయాందోళనల్ని పక్కన పెట్టేసి.. ఉన్నంత కాలం హ్యాపీగా ఉంటే సరి.