Begin typing your search above and press return to search.

సమ్మెబాట పట్టి.. అమెజాన్ కు షాకిచ్చిన ఉద్యోగులు

By:  Tupaki Desk   |   1 Jun 2023 12:00 PM GMT
సమ్మెబాట పట్టి.. అమెజాన్ కు షాకిచ్చిన ఉద్యోగులు
X
కార్పొరేట్ ప్రపంచంలో సమ్మెబాట పట్టే వ్యవహారాల్ని ఇటీవల కాలంలో చూసి ఉండలేదు. కానీ ఆ కొరత ను తీర్చేశారు అమెజాన్ ఉద్యోగులు. తమ సంస్థ అనుసరిస్తున్న విధానాల పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెజాన్ ఉద్యోగులు.. సంస్థకు దిమ్మ తిరిగేలా షాకిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మాంద్యం నేపథ్యంలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతతో పాటు.. ఆఫీసుకు వచ్చి మాత్రమే పని చేయాలంటూ విధించిన నిబంధనల్నినిరసిస్తూ అమెరికా లోని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అమెరికా లోని సంస్థ ప్రధాన కార్యాలయమైన సియాటెల్ కు చెందిన పలువురు ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి అమెజాన్ కార్యాలయం బయటకు వచ్చి నిరసన తెలపటం సంచలనంగా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా నిరసనకు 1816 మంది ఉద్యోగులు దిగితే.. సియాటిల్ లోనే 873 మంది (ఈ క్యాంపస్ లో అమెజాన్ ఉద్యోగులు 65వేల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం) పాల్గొన్న విషయాన్ని ఉద్యోగులు వెల్లడించారు. సంస్థ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలతో తమ జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయో చెప్పటానికే సమ్మో బాట పట్టినట్లుగా పేర్కొన్నారు.

తన ఖర్చుల్ని తగ్గించుకోవటం కోసం అమెజాన్ మొత్తం 27 వేలమంది ఉద్యోగుల్ని తొలగించింది. అంతేకాదు.. కొవిడ్ టైంలో ఇచ్చిన ఇంటి నుంచి పని చేసే సౌకర్యాన్ని బంద్ చేసి.. వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలన్న నిబంధన పై అమెజాన్ ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మే 1 నుంచి ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసుల కు రావాలని సంస్థ తేల్చి చెప్పటంతో ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. అయితే.. అమెజాన్ స్పందన మాత్రం వేరేలా ఉంది. ఎక్కువ మంది ఉద్యోగులు ఆఫీసు కు తిరిగి రావటం పై తాము సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాజా పరిణామాలు అమెజాన్ కు గుణపాఠాలుగా అభవర్ణిస్తున్నారు.

ఎంత మంచి కంపెనీ అయినా తన ఉద్యోగుల విషయంలో తప్పుడు మార్గాన్నిసంస్థ ఎంచుకుంటే తిరుగుబాటు తప్పక వస్తుందన్న విషయం అమెజాన్ విషయంలో మరోసారి ఫ్రూవ్ అయ్యిందంటున్నారు. మరిప్పుడు ఆ సంస్థ ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.