Begin typing your search above and press return to search.

దుబ్బాకలో కొత్త తరహా పంపిణీ.. వారికి రూ.2వేలు.. వీరికి రూ.వెయ్యి

By:  Tupaki Desk   |   3 Nov 2020 4:30 AM GMT
దుబ్బాకలో కొత్త తరహా పంపిణీ.. వారికి రూ.2వేలు.. వీరికి రూ.వెయ్యి
X
సరికొత్త పద్దతులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది దుబ్బాక ఉప ఎన్నిక. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క కాగా.. తాజాగా జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక మరో లెక్కనని చెబుతున్నారు. ఒక ఉప ఎన్నిక ఇంత గరంగరంగా జరుగుతున్నది తీరు ఇప్పటివరకు చూసింది లేదు. ఇదిలా ఉంటే.. కీలకమైన పోలింగ్ కు ముందు ఒక రాజకీయ పార్టీ అనుసరిస్తున్న వైనం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారిందని చెబుతున్నారు.

నాలుగు రోజుల క్రితం వరకు ప్రజల్లో పెద్దగా నానని పార్టీ.. గ్రౌండ్ లెవల్లో తీవ్రంగా కసరత్తు చేస్తోందని చెబుతున్నారు. తమను అండర్ డాగ్స్ గా అందరూ అనుకుంటున్న వేళ.. తమ పని తాము గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటూ పోతున్నారని.. ఓట్ల లెక్కింపు రోజున మిగిలిన పార్టీలకు భారీ షాక్ తగలటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారు ధీమా ఏమిటన్నది చూస్తే.. ఆశ్చర్యకరమైన అంశం బయటకు వచ్చింది.

అదేమంటే.. ఓటర్లకు నోట్ల పంపిణీలో ఇప్పటివరకు ఉన్న పద్దతులకు భిన్నమైన విధానాన్ని ఒక రాజకీయ పార్టీ అనుసరించిందని చెబుతున్నారు. ఓటుకు రూన2వేలు చొప్పున పంచేస్తున్న సదరు పార్టీ.. నోట్లు తీసుకునే ముందు కచ్ఛితంగా ఒట్టు వేయాలని చెబుతున్నారు. ఒకవేళ.. ఒట్టు వేయటం ఇష్టం లేకపోతే ఓటుకు రూ.వెయ్యి ఇస్తామని చెబుతున్నారు. ఓటుకు నోటు పంపిణీలో ఒట్టు కీలకంగా మారిందని చెబుతున్నారు. గతంలోనే ఒట్టు వేయించుకొని డబ్బుల పంపిణీ జరిగేది కానీ.. ఈ రీతిలో మాత్రం కాదంటున్నారు. కొత్త పద్దతికి తెర తీసిన సదరు పార్టీని ఓటర్లు ఏం చేస్తారో చూడాలి.