Begin typing your search above and press return to search.
అమెరికా అధ్యక్షుడి విమానాన్ని ఢీ కొట్టబోయిన డ్రోన్!!
By: Tupaki Desk | 18 Aug 2020 4:00 AM GMTప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. దేశాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానాన్ని ఒక డ్రోన్ ఢీ కొట్టబోయిన అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. దీంతో.. అమెరికా అధ్యక్షుల వారి విమానానికి ప్రమాదం కాస్తలో తప్పినట్లైంది.
కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ సమాచారం వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్సు వన్ విమానం ఆదివారం రాత్రి వాషింగ్టన్ సమీపంలోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే వేళలో ఈ ఘటన చోటు చేసుకన్నట్లు చెబుతున్నారు. అధ్యక్షుల వారు ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్సు వన్ ల్యాండ్ అయ్యే వేళలో.. ఒక డ్రోన్ విమానానికి అత్యంత సమీపంగా వచ్చింది.
విమానం ల్యాండ్ అయ్యే సమయానికి విమానానికి కుడివైపు భాగంగా ఒక డ్రోన్ రావటం.. అది పసుపు.. నలుపు రంగులో ఉన్నట్లుగా విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది గుర్తించారు. ఎయిర్ ఫోర్సు వన్ కు అత్యంత సమీపానికి డ్రోన్ వచ్చిందని.. దాదాపుగా ఢీ కొట్టినంత పని చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో షాక్ తిన్న నిఘా వర్గాలు.. ఆ డ్రోన్ ఎవరిది? ఎందుకు అంత దగ్గరగా వచ్చిందన్న విషయంపైన అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఉదంతంలో ఎయిర్ ఫోర్సు వన్ విమానానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని చెబుతున్నారు.